ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దానం చేయండయ్యా అని బిచ్చగత్తెలు అడగడంతో షాపులోంచి ఇంట్లోకెళ్లి డబ్బులు తెచ్చి ఇచ్చాడు.. కాసేపాగాక వాళ్లెవరో తెలిసి..

ABN, First Publish Date - 2022-02-20T19:44:18+05:30

అతను మెటల్ స్టోర్ నడుపుతున్నాడు.. శనివారం ఉదయం ఎప్పటిలాగానే దుకాణం తెరిచాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను మెటల్ స్టోర్ నడుపుతున్నాడు.. శనివారం ఉదయం ఎప్పటిలాగానే దుకాణం తెరిచాడు.. కొద్దిసేపటికి ముగ్గురు బిచ్చగత్తెలు వచ్చి ఏమైనా ఇమ్మన్నారు.. అతను ఇంట్లోకెళ్లి చిల్లర డబ్బులు తెచ్చి ఇచ్చాడు.. అవి తీసుకుని వారు వెళ్లిపోయారు.. కొద్ది సేపటి తర్వాత క్యాష్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసి అతను షాకయ్యాడు.. అందులో ఉండాల్సిన రూ.7.5 లక్షలు లేవు. దీంతో వెంటనే అతను పోలీసులను ఆశ్రయించాడు.. 


ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జై రామ్ మెటల్‌ స్టోర్‌ను నిర్వహిస్తున్న రామ్ అగర్వాల్ శనివారం ఉదయం 10 గంటలకు షాపు తెరిచాడు. 11 గంటల సమయంలో ముగ్గురు బిచ్చగత్తెలు వచ్చి ఏమైనా ఇమ్మన్నారు. అతను ఇంట్లోకెళ్లి చిల్లర డబ్బులు తెచ్చి ఇచ్చాడు. అవి తీసుకుని వారు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తర్వాత రామ్ అగర్వాల్ క్యాష్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు. అందులో ఉండాల్సిన రూ.7.5 లక్షలు లేవు. బ్యాగ్ అంతా ఖాళీగా ఉంది. దీంతో వెంటనే అతను పోలీసులను ఆశ్రయించాడు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. సాయంత్రానికి రైల్వే స్టేషన్ సమీపంలో ఆ ముగ్గురు మహిళలు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సోనీ, కవిత, రంజని కొద్ది రోజుల క్రితం బిలాస్‌పూర్‌కు వచ్చి అడుక్కుంటూ అప్పుడప్పుడు దొంగతనాలు కూడా చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.7.5 లక్షలు రికవరీ చేసుకున్నారు. 

Updated Date - 2022-02-20T19:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising