ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మెట్రో స్టేషన్ పై నుంచి దూకి మరణించిన యువతి గురించి అసలు నిజాలివి.. చెవిటి.. మూగ.. పైగా రెండ్రోజుల క్రితమే..

ABN, First Publish Date - 2022-04-16T19:22:27+05:30

దేశ రాజధాని ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన 22 ఏళ్ల యువతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మరణించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ రాజధాని ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసిన 22 ఏళ్ల యువతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మరణించింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఈమె గురువారం ఉదయం 7.30 సమయంలో మెట్రోస్టేషన్‌ భవంతి పై నుంచి కిందికి దూకేందుకు సిద్ధమైంది.   వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఆమెను వారించేందుకు ప్రయత్నించారు. అయినా ఆమె దూకేయడంతో కింద భారీ దుప్పటిని అడ్డుగా పట్టుకుని నిలబడ్డారు. 


కిందికి దూకిన ఆమెను దుప్పటితో పట్టుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిందని తాజాగా అధికారులు తెలిపారు. ఆమె మెట్రో స్టేషన్ పై నుంచి దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె సురక్షితంగానే బయటపడిందని అందరూ భావించారు. అయితే తీవ్ర గాయాల పాలవడంతో ఆమె మరణించింది. 


పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఈ యువతి పుట్టుకతోనే మూగ, చెవిటి అని సమాచారం. హర్యానాలోని గురుగ్రామ్‌‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఈ యువతి రెండ్రోజుల క్రితమే తన ఉద్యోగానికి రాజీనామా చేసిందట. ఈమె మాత్రమే కాదు.. ఈమె కుటుంబానికి చెందిన అందరూ బధిరులేనని వార్తలు వస్తున్నాయి. ఆమె ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాఫ్తు సాగిస్తున్నారు. 



Updated Date - 2022-04-16T19:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising