ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా పరిశోధకురాలిపై ‘వర్చువల్’ అత్యాచారం!

ABN, First Publish Date - 2022-05-28T02:07:18+05:30

కొన్ని విషయాలు విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తాయి. ఇంకొన్ని నమ్మశక్యం కాకుండా ఉంటే.. మరికొన్ని ఔరా అనిపిస్తాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొన్ని విషయాలు విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తాయి. ఇంకొన్ని నమ్మశక్యం కాకుండా ఉంటే.. మరికొన్ని ఔరా అనిపిస్తాయి. ఇటీవల కొంతకాలంగా ప్రాంతాలతో పనిలేకుండా అత్యాచార వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. భౌతికంగా జరిగే ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు చెప్పేది మాత్రం పూర్తి సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. అవునా! అని నోరెళ్లబెట్టేలా చేస్తుంది. మెటా ప్లాట్‌ఫామ్స్ ద్వారా హారిజన్ వరల్డ్స్ సోషల్ వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని పరిశోధిస్తున్న ఒక మహిళ వర్చువల్ ప్రపంచంలో ఓ అపరిచితుడి చేతిలో అత్యాచారానికి గురైంది. 


వాతావరణ మార్పు, కార్మికుల హక్కులు, వివక్ష, మానవ హక్కులు, జంతు హక్కులు, అవినీతి, కార్పొరేట్ అధికార దోపిడి వంటి సమస్యలపై కార్పొరేషన్‌లను జవాబుదారీగా ఉంచాలని ప్రచారం చేసే లాభాపేక్షలేని న్యాయవాద సంస్థ, ఆన్‌లైన్ కమ్యూనిటీ అయిన సమ్‌ఆఫ్‌యూస్ (SumOfUs) ఈ నెల మొదట్లో 21 ఏళ్ల మహిళా రీసెర్చర్‌ను వర్చువల్ ప్రపంచంలోకి పంపింది. ఆమె ఆ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించిన గంటలోపే ‘దిక్కుతోచని, గందరగోళ అనుభవం’ ఆమెకు ఎదురైంది. లైంగికంగా వేధింపులకు గురైంది. 


‘‘ఇది చాలా వేగంగా జరిగిపోయింది. నా మెదడులోని ఒక భాగంలో ‘డబ్ల్యూటీఎఫ్’ జరుగుతున్నట్టు అనిపిస్తే, మరో భాగం మాత్రం ఇది నిజమైన శరీరం  కాదని చెబుతోందని అని ఆమె చెప్పుకొచ్చింది. ఇదే విషయమై మెటా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. వర్చువల్ ప్రపంచంలోకి వెళ్లిన పరిశోధకురాలికి ‘పర్సనల్ బౌండరీ’ ఫీచర్ ఆన్‌లో లేదని ‘డెయిలీ మెయిల్’కు తెలిపారు. పర్సనల్ బౌండరీ ఫీచర్ అనేది స్నేహితులు కాని వ్యక్తులు ఆమె దగ్గరకు రాకుండా నిరోధించే సేఫ్టీ టూల్ ఇది.  


హారిజన్ ప్రపంచాల్లో పర్సనల్ బౌండరీ డిఫాల్ట్‌గా నాలుగు అడుగులు (ఒక మీటరు) ఉంటుంది. స్నేహితులు కానివారు అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఇది అడ్డుకుంటుంది. హారిజన్ వరల్డ్స్ అనేది ఉచిత వర్చువల్ రియాలిటీ. ఆన్‌లైన్ వీడియో గేమ్ సమీకృత గేమ్ క్రియేషన్ సిస్టంతో ఓకులస్ రిఫ్ట్ ఎస్, ఓకులస్ క్వెస్ట్ 2 కోసం మెటా ప్లాట్‌ఫామ్‌లు అభివృద్ధి చేసి పబ్లిష్ చేశాయి. 18 ఏళ్లు, ఆ పైబడిన వారి కో సం అమెరికా, కెనడాలలో గతేడాది డిసెంబరు 9న విడుదల చేశారు. 

Updated Date - 2022-05-28T02:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising