ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి రాయించుకుని తల్లిని బయటకు గెంటేసిన కొడుకులు.. ఆమె వారికి ఎలా గుణపాఠం చెప్పిందంటే..

ABN, First Publish Date - 2022-01-11T17:59:44+05:30

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తిని తీసుకున్న తర్వాత వారిని పట్టించుకోవడం మానేసే పిల్లల గురించి తరచుగా వింటూ ఉంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తిని తీసుకున్న తర్వాత వారిని పట్టించుకోవడం మానేసే పిల్లల గురించి తరచుగా వింటూ ఉంటాం. పిల్లల చేతుల్లో మోసపోయిన తల్లిదండ్రులు తమలో తామే బాధపడతారు తప్ప.. ఎదురు తిరగరు. అయితే కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు అలా ఏడుస్తూ కూర్చోలేదు. 76 ఏళ్ల వయసులోనూ న్యాయ పోరాటం చేసి పిల్లలకు తగిన గుణపాఠం చెప్పింది. ఆస్తిలో తన వాటా తిరిగి దక్కించుకుంది. 


కర్ణాటకలోని హవేరికి చెందిన ప్రేమవ్వ (76) అనే వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లికి మాయ మాటలు చెప్పి వారసత్వంగా వచ్చిన ఆస్తిని నలుగురూ సమానంగా పంచుకున్నారు. ఆ తర్వాత తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో ఆ తల్లి న్యాయపోరాటం ప్రారంభించింది. తన పిల్లలు మోసం చేసి తన ఆస్తిని రాయించుకున్నారని, దానిని రద్దు చేసి తనకు కూడా ఆస్తిలో వాటా దక్కేలా చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మూడేళ్లుగా ఆమె న్యాయపోరాటం చేస్తోంది. 


చివరకు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గతంలో ఆమె చేసిన ఆస్తి పంపకాన్ని రద్దు చేస్తూ రెవెన్యూ విభాగం అసిస్టెంట్ కమిషనర్ తీర్పునిచ్చారు. భూమి, ఇంటికి సంబంధించిన యాజమాన్య పత్రాల్లో ప్రేమవ్వ పేరును కూడా చేర్చారు. వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం అసిస్టెంట్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  

Updated Date - 2022-01-11T17:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising