ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: తనను కౌగిలించుకున్న సహోద్యోగిపై కేసు పెట్టిన మహిళ.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2022-08-17T02:03:34+05:30

తనను గట్టిగా కౌగిలించుకున్న సహోద్యోగి తనకు నష్ట పరిహారం (Woman sues colleague) చెల్లించాలని చైనాకు చెందిన ఓ మహిళ దావా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనను గట్టిగా కౌగిలించుకున్న సహోద్యోగి తనకు నష్ట పరిహారం (Woman sues colleague) చెల్లించాలని చైనాకు చెందిన ఓ మహిళ దావా వేసింది. ఎందుకంటే అతను బలంగా కౌగిలించుకోవడం వల్ల ఆమె పక్కటెముకల్లో మూడు విరిగిపోయాయి. దీంతో హాస్పిటల్ పాలైన మహిళ తన సహోద్యోగిపై కేసు వేసింది. చైనా (China)లోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ తన సహోద్యోగితో మాట్లాడుతుండగా మగ సహోద్యోగి ఆమె వద్దకు వచ్చి చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు.


ఇది కూడా చదవండి..

Viral Video: నీటి కొలనులో పడిన ఏనుగు పిల్ల కోసం పరుగులు పెట్టిన ఏనుగులు.. చివరకు ఎలా రక్షించాయో చూడండి..


నొప్పి భరించలేక ఆ మహిళ కేకలు వేసింది. అతను విడిచిపెట్టిన తర్వాత ఆమెకు ఛాతీ భాగంలో చాలా అసౌకర్యంగా అనిపించింది. తనకు తోచిన ప్రాథమిక చికిత్స చేసుకుంది. ఐదు రోజుల తర్వాత నొప్పి మరింత ఎక్కువ కావడంతో హాస్పిటల్‌కు వెళ్లి ఎక్స్-రే తీయించుకుంది. ఎక్స్-రేలో మహిళకు మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. దాంతో ఆ మహిళ ఆఫీస్‌కు సెలవు పెట్టి హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చింది. జీతంలో కోత పడడమే కాకుండా.. వైద్య బిల్లులు, నర్సింగ్ సేవలకు చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. తనకు ఆ పరిస్థితి ఎదురవడానికి కారణమైన సహోద్యోగికి ఆమె అన్నీ వివరంగా చెప్పి ఆర్థిక సహాయం చేయాలని అడిగింది. 


అందుకు ఆ సహోద్యోగి నిరాకరించాడు. తన కౌగిలింత వల్ల ఎముకలు విరిగి ఉండవని బుకాయించాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించి నష్టపరిహారం కోసం దావా వేసింది. కేసు విచారించిన న్యాయమూర్తి సదరు సహోద్యోగి 10,000 యువాన్లు (రూ. 1.16 లక్షలు) బాధిత మహిళకు చెల్లించాలని ఆదేశించారు. ఆ ఐదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే ఎలాంటి కార్యకలాపాల్లోనూ మహిళ పాల్గొనలేదని రుజువు అయినట్టు కోర్టు పేర్కొంది.

Updated Date - 2022-08-17T02:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising