ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబోయే అత్త ప్రవర్తన నచ్చలేదట.. ప్రేమించిన వాడితో పెళ్లిని రద్దు చేసుకున్న యువతి కథ ఇదీ..!

ABN, First Publish Date - 2022-06-24T20:48:18+05:30

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సూపర్ హిట్ సినిమా `ఆనంద్` చూశారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సూపర్ హిట్ సినిమా `ఆనంద్` చూశారా? ఆ సినిమాలో హీరోయిన్‌కు కాబోయే అత్తగారు పెళ్లి చీర నుంచి ప్రతి విషయంలోనూ తన ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నిస్తుంటుంది. తన ఆత్మాభిమానాన్ని చంపుకుని బతికేందుకు ఇష్టపడక హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. అచ్చం అలాంటి సందర్భమే ఎదురైనపుడు ఓ యువతి కూడా ఆ హీరోయిన్‌లాగానే ప్రవర్తించింది. తన ఆత్మాభిమానానికే ఓటేసి ప్రియుడితో పెళ్లిని రద్దు చేసుకుంది. ఆమె తన కథను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. 


ఇది కూడా చదవండి..

Viral Video: పెళ్లి వేదిక మీదే వరుడి చెంప పగలగొట్టిన వధువు సోదరి.. కారణమేంటో వీడియోలో మీరే చూడండి..


`నేను కొద్ది రోజులుగా ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాను. నేను కోరుకునే లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయనిపించింది. మా ఇద్దరికీ నిశ్ఛాతార్థం కూడా జరిగింది. ఆ తర్వాత నాలో భయాలు మొదలయ్యాయి. అతని తల్లి పెళ్లి కార్యక్రమాన్ని నియంత్రించడం ప్రారంభించింది. నా దుస్తులను విమర్శించేది.  పెళ్లి ప్రక్రియలో ప్రతీ విషయం ఆమె ఆదేశానుసారం జరగాల్సిందే. శుభలేఖల దగ్గర్నుంచి, విందులో ఏమి వడ్డించాలో నిర్ణయించే వరకు.. ఏదైనా ఆమె ఇష్టప్రకారమే జరగాలి. ఈ విషయాలను నేను నా కాబోయే భర్తకు చెప్పాను. 


అతను ఏమీ మాట్లాడకుండా సర్దుకుపోవాలని నాకు చెప్పేవాడు. నాకు కొంత ప్రైవసీ కావాలని, వివాహం తర్వాత ఇద్దరం కలిసి ఓ గూడు నిర్మించుకుందామని నా ప్రేమికుడిని అడిగాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. తన తల్లి ఉంటున్న ఇల్లే ఎప్పటికీ తన నివాసం అని చెప్పాడు. అప్పుడు నేను పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నాను. ఇప్పుడు నా వయసు 30 ఏళ్లు. ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నాను. నాకు మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని తల్లి కావాలని ఉంద`ని ఆ యువతి పేర్కొంది. 

Updated Date - 2022-06-24T20:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising