ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తన కంటే 12 ఏళ్ల తక్కువ వయసున్న వ్యక్తితో ప్రేమ.. అతడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఎలాంటి పని చేసిందంటే..

ABN, First Publish Date - 2022-02-22T18:08:39+05:30

ఆమె వయసు 32.. అతడి వయసు 20.. పక్క పక్క గ్రామాలకు చెందిన ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె వయసు 32.. అతడి వయసు 20.. పక్క పక్క గ్రామాలకు చెందిన ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. ఇద్దరూ కొన్ని రోజులు కలిసి తిరిగారు.. ఆ యువకుడికి ఉద్యోగం రావడంతో ఊరు వదలి వెళ్లిపోయాడు.. ఆ మహిళను కూడా దూరం పెట్టాడు.. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు.. దీంతో ఆ మహిళ ఆ యువకుడి సోదరుడిని కిడ్నాప్ చేసింది.. విషయం పోలీసులకు తెలియడంతో కటకటాల పాలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌‌కు సమీపంలో జరిగింది. 


బులంద్‌షహర్‌కు సమీపంలో ఉన్న ఛతారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రెండు గ్రామాలకు చెందిన హీరాలాల్ (20), పింకీ (32) ప్రేమించుకున్నారు. కొన్ని రోజుల పాటు కలిసి తిరిగారు. అయితే తనకు ఉద్యోగం రావడంతో హీరాలాల్ గుర్‌గావ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత పింకీని దూరం పెట్టాడు. ఆమె ఫోన్ చేస్తే స్పందించే వాడు కాదు. పెళ్లి చేసుకునేది లేదని చెప్పాడు. దీంతో పింకీ తనకు అల్లుడి వరసయ్యే యువకుడి సహాయంతో కిడ్నాప్ ప్లాన్ వేసింది. హీరాలాల్ తమ్ముడు డోరీలాల్ (6)ను కిడ్నాప్ చేసింది. 


ఆ విషయం హీరాలాల్‌కు ఫోన్ చేసి చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. హీరాలాల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పింకీ ఫోన్‌ ట్రేస్‌ చేసి బాలుడిని సురక్షితంగా విడిపించారు. పింకీతో పాటు ఆమె అల్లుడిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలుడు డోరిలాల్‌ను అతని తల్లిదండ్రులకు అప్పగించారు.


Updated Date - 2022-02-22T18:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising