ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బంగారం దుకాణంలోకి కస్టమర్‌లా వచ్చి తుపాకీ తీసి బెదిరించిన యువతి.. వెంటనే అతడు చేసిన పనికి బిత్తరపోయి..

ABN, First Publish Date - 2022-05-26T18:30:50+05:30

ఆమె కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయింది.. అప్పట్నుంచి కుటుంబ పోషణ కోసం దొంగతనాలకు అలవాటు పడింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయింది.. అప్పట్నుంచి కుటుంబ పోషణ కోసం దొంగతనాలకు అలవాటు పడింది.. మంగళవారం మధ్యాహ్నం ఆమె బుర్ఖా ధరించి ముంబైలోని ఓ నగల దుకాణానికి వెళ్లింది.. యజమాని ఆమెకు కొన్ని నగలు చూపించాడు.. ఆ సమయంలో ఆమె తన బ్యాగ్ నుంచి తుపాకీ తీసి అతనికి గురి పెట్టింది.. కింద కూర్చుని చేతులు మోకాళ్ల మీద పెట్టుకోవాలని ఆదేశించింది.. అయితే ఆ యజమాని వేగంగా ఆమె మీదకు దూకి తుపాకీ లాక్కుని షాకిచ్చాడు. 


ఇది కూడా చదవండి..

భర్తను రోజూ చితకబాదుతున్న భార్య.. పరువు పోతుందని 9 ఏళ్లుగా ఎవరికీ చెప్పని భర్త.. కానీ హింస మరీ ఎక్కువ అవడంతో..




ముంబైకి చెందిన రియా అనే యువతి కోవిడ్‌కు ముందు ఓ బార్‌లో పని చేసేది. లాక్‌డౌన్ సమయంలో ఆమె ఉద్యోగం పోయింది. దీంతో ఆమె కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న క్రైమ్‌లు చేసేది. మంగళవారం మధ్యాహ్నం విరార్‌లో ఉన్న దేవ్‌నారాయన్ జ్యువెలర్స్‌ షాప్‌లోకి వెళ్లింది. యజమాని దేవీలాల్ గుజార్ ఆమెకు కొన్ని నగలు చూపించాడు. ఆ సమయంలో రియా తన బ్యాగ్ నుంచి తుపాకీ తీసి గుజార్‌కి గురి పెట్టింది. కింద కూర్చుని చేతులు మోకాళ్ల మీద పెట్టుకోవాలని ఆదేశించింది. అయితే గుజార్ వేగంగా కౌంటర్ పై నుంచి ఆమె మీదకు దూకి తుపాకీ లాక్కున్నాడు. 


ఆమె బుర్ఖా లాగి బయటకు ఈడ్చుకెళ్లాడు. అదే సమయంలో బయట నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రియాను అదుపులోకి తీసుకున్నారు. రియా చూపించింది నిజమైన తుపాకీ కాదని, స్టీల్‌తో తయారు చేసిన సిగరెట్ లైటర్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు రియాను విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటన మొత్తం షాప్‌లో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. FPJ సౌజన్యంతో ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి



Updated Date - 2022-05-26T18:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising