ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని శుభ్రం చేస్తుండగా బయటపడ్డ Secret Safe.. అందులో ఏమున్నాయో చూసి..

ABN, First Publish Date - 2022-08-28T19:52:01+05:30

ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తక్కువ ధరకు వస్తుంది కదా.. అని వేలంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అనంతరం శుభ్రం చేసేందుకు ఆ ఇంటికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తక్కువ ధరకు వస్తుంది కదా.. అని వేలంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అనంతరం శుభ్రం చేసేందుకు ఆ ఇంటికి వెళ్లారు. ఇల్లు శుభ్రం చేస్తుండగా.. వారికి Secret Safe(అల్మారా) కంట పడింది. అందులో విలువైన ఆభరణలు ఉండొచ్చని భావించారు. కష్టపడి దాన్ని ఓపెన్ చేశారు. చివరకు అందులో కనిపించిన వాటిని చూసి పోలీసులకు ఫోన్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో ఇంతకూ ఆ ప్రేమ జంటకు Secret Safeలో ఏం కనిపించాయనే పూర్తి వివరాల్లోకి వెళితే..



అమెరికా(America)కు చెందిన టిఫనీ.. తన బాయ్‌ఫ్రెండ్‌ మ్యాట్‌తో కలసి ఒకే ఇంట్లో జీవించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి వేలంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అందులోకి షిఫ్ట్ కావాలనే ఉద్దేశంతో.. ఇంటి వద్దకు వెళ్లి తలుపులు ఓపెన్ చేశారు. ఇంట్లో పాత ఓనర్‌కు సంబంధించిన.. సోఫాలు, టీవీలు తదితర వస్తువులు ఉన్నాయి. వాటిని చూసి, ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే వారికి Secret Safe కనిపించింది. అందులో విలువైన వస్తువులు ఉండొచ్చని ఆ ప్రేమజంట భావించింది. కష్టపడి దాన్న్ని ఓపెన్ చేశారు. చివరకు అందులో.. గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళతో అభ్యంతకర స్థితిలో ఉండగా తీసిన ఫొటోలను గుర్తించారు. వాటితోపాటు కొన్ని ఇన్సురెన్సు పేపర్లు, రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి కత్తి, బులెట్లను చూసి కంగుతిన్నారు. వెంటనే వాటని వీడియోతీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. అనంతరం పోలీసు(Police)లకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు వచ్చిన అధికారులు ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-08-28T19:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising