ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

pet dog bites child:లిఫ్టులో బాలుడిని కరిచిన పెంపుడు జాగిలం...వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-09-07T17:40:01+05:30

లిఫ్టులో(elevator) ఉన్న బాలుడిని ఓ పెంపుడు శునకం(dog) కరిచిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చూస్తుండి పోయిన యజమానురాలు

ఘజియాబాద్:లిఫ్టులో(elevator) ఉన్న బాలుడిని ఓ పెంపుడు శునకం(dog) కరిచిన ఘటన ఘజియాబాద్ నగరంలోని హౌసింగ్ సొసైటీలో(housing society) సంచలనం రేపింది.రాజ్ నగర్ ఎక్స్ టెన్షన్ ఛార్మ్స్ కాజిల్ హౌసింగ్ సొసైటీలో ఓ బాలుడు(boy) స్కూలు నుంచి వచ్చి ఇంటికి వెళ్లేందుకు అపార్టుమెంటులో లిఫ్టు ఎక్కాడు.పెంపుడు కుక్కను తీసుకొని దాని యజమానురాలు(Woman) లిఫ్టు ఎక్కింది.లిఫ్టు పైకి వెళుతుండగా ఆ పెంపుడు జాగిలం బాలుడిపైకి లంఘించి కరిచింది. తన పెంపుడు కుక్క లిఫ్టులో ఉన్న బాలుడిని కరుస్తున్నా, దాని యజమానురాలైన మహిళ చోద్యం చూస్తూండి పోయింది.(boy was bitten by a dog) కుక్క కరవడంతో ఆ బాలుడు బాధతో విలవిలలాడుతున్నా కనీసం ఆ పెంపుడు కుక్క యజమానురాలు స్పందించకుండా...బాలుడిని వదిలేసి లిఫ్టు దిగి వెళ్లిపోయింది.


లిఫ్టు దిగేటప్పుడు కూడా ఆ కుక్క మరోసారి బాలుడిని కరిచేందుకు లంఘించింది. కాని ఈ సారి తాడుతో ఆ మహిళ లాగింది. లిఫ్టులో జరిగిన ఈ ఘటన అంతా దానిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.ఈ వీడియోను సొసైటీ నివాసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.(viral video) బాలుడి తల్లిదండ్రులు నందిగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కుక్క యజమానురాలిపై ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు(police case) నమోదు చేశారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేర తాము దర్యాప్తు చేస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ అలోక్ దూబే చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ మహిళకు 5వేల రూపాయల జరిమానా(fine) విధించారు. 





Updated Date - 2022-09-07T17:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising