ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: విహార యాత్ర ముగించుకుని ఇంటికెళ్లిన మహిళ.. బ్యాగ్ తెరిచి లోపల ఉన్న వాటిని చూసి షాక్!

ABN, First Publish Date - 2022-08-01T20:51:58+05:30

విహారయాత్ర ముగించుకుని నూతన ఉత్సాహంతో ఇంటికెళ్లిన ఓ మహిళ తన బ్యాగ్ తెరిచి చూసి నివ్వెరపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విహారయాత్ర ముగించుకుని నూతన ఉత్సాహంతో ఇంటికెళ్లిన ఓ మహిళ తన బ్యాగ్ తెరిచి చూసి నివ్వెరపోయింది. భయంతో కేకలు వేసింది. ఎందుకంటే ఆమె బ్యాగ్‌లో ఒక ఆడ తేలు, పక్కన 17 చిన్న తేళ్లు (18 scorpions) కనిపించాయి. దీంతో ఆమె వెంటనే జంతు సంరక్షణ కేంద్ర సిబ్బందికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు వెంటనే వచ్చి ఆ తేళ్లను పట్టుకున్నారు. ఆస్ట్రియా (Austria)లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: డాక్టర్‌పై మర్డర్ కేసు.. ఆపరేషన్ థియేటర్‌లో అతను చేసిన పనికి అందరూ షాక్!


ఆస్ట్రియాలోని నాటర్న్‌బాచ్‌కు చెందిన ఓ మహిళ విహార యాత్ర కోసం క్రొయేషియా (Croatia vacation) వెళ్లింది. కొన్ని రోజులు అక్కడ గడిపి ఇటీవల ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తన బ్యాగ్ తెరిచినప్పుడు.. లోపల ఒక ఆడ తేలుతో స‌హా దాని 17 పిల్లలు కనిపించాయి. షాకైన ఆ మహిళ వెంటనే యానిమల్ రెస్క్యూ సర్వీస్ సిబ్బందిని సంప్రదించి, వాటిని తొలగించాల్సిందిగా కోరింది. సిబ్బంది వెంటనే ఆమె ఇంటికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు.  ఆ తేళ్ల‌ను సురక్షితంగా క్రొయేషియాకు పంపబోతున్నామని అధికారులు చెప్పారు. 

Updated Date - 2022-08-01T20:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising