ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదిలో పిల్లలను తోసేసిన మహిళ.. ఆమెను మంత్రగత్తెగా భావించి మత్స్యకారుల పరుగులు.. అసలేం ఏమైందంటే?..

ABN, First Publish Date - 2022-01-02T11:53:20+05:30

గంగా నదిలో ఒక మహిళ అయిదుగురు పిల్లలను తోసేసింది. అది చూసిన చుట్టుపక్కల మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు. ఆమె ఎవరో మంత్రగత్తె అని పిల్లలను హత్య చేసిందని పోలీసులకు సమాచారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగా నదిలో ఒక మహిళ అయిదుగురు పిల్లలను తోసేసింది. అది చూసిన చుట్టుపక్కల మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు. ఆమె ఎవరో మంత్రగత్తె అని పిల్లలను హత్య చేసిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బదోహి జిల్లాలో జరిగింది. 


ఉత్తర్ ప్రదేశ్‌లోని బదోహి జిల్లా పరిధి జహంగీరాబాద్ గ్రామంలో గంగా నది తీరాన ఆదివారం ఒక మహిళ తనతో అయిదుగురు పిల్లలతో వచ్చింది. అక్కడ ఒక పడవలో పిల్లలను తీసుకొని ఆమె నది మధ్య వరకు వెళ్లింది. నది బాగా లోతుగా ఉన్న ప్రదేశానికి చేరుకొని పిల్లలందరినీ నీళ్లలోకి తోసేసింది. దీంతో ఆ సమయంలో అక్కడున్న మత్స్యకారులు ఆ దృశ్యం చూసి భయపడి పోయారు. ఆ మహిళను ఒక మంత్రగత్తె అనుకొని గ్రామంలోకి పారిపోయి.. పోలీసులకు సమాచారం అందించారు. 


పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళను అరెస్టు చేశారు. నీళ్లు లోతుగా ఉండడంతో పిల్లల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ మహిళ గురించి విచారణ చేయగా.. ఆమె పేరు మంజు యాదవ్ అని తేలింది. ఆ పిల్లలు ఆమె పిల్లలే అని తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. మంజు యాదవ్ తన భర్త మృదుల్ యాదవ్‌తో గత కొంత కాలంగా గొడవ పడేదని.. అలా ఆ రోజు భర్తతో గొడవపడి పిల్లలను తీసుకొని బయటికి వచ్చేసింది. ఆ తరువాత పిల్లలను నది వద్ద తీసుకెళ్లి నీళ్లలో ముంచేసింది. 


ప్రస్తుతం పోలీసులు ఆమెను అరెస్టు చేసి పిల్లల హత్య కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-01-02T11:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising