ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25 ఏళ్లకే కానిస్టేబుల్ జాబ్.. ప్రభుత్వోద్యోగం వచ్చిందని సంతోషంగా ఉండాల్సిన యువతి ఇలా చేసిందేంటి..!

ABN, First Publish Date - 2022-05-16T20:38:28+05:30

ఆమెకు గతేడాది కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.. పాతికేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి ట్రైనింగ్‌లో జాయిన్ అయిన ఆ యువతికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమెకు గతేడాది కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.. పాతికేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి ట్రైనింగ్‌లో జాయిన్ అయిన ఆ యువతికి ఈ ఏడాది జనవరిలో పోస్టింగ్ వచ్చింది.. నాలుగు నెలలు సంతోషంగా ఉద్యోగం చేసిన ఆ యువతి సెలవు కోసం ఇంటికి వెళ్లింది.. తిరిగి సోమవారం ఉద్యోగంలో జాయిన్ కావాలి.. ఆ తరుణంలో ఆదివారం సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకుంది.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. 


ఆగ్రాలోని ఫతేబాద్‌కు చెందిన సరితా నిషాద్ 2021లో పోలీసు శాఖలో ఉద్యోగం సాధించింది. ట్రైనింగ్ అనంతరం ఈ ఏడాది జనవరి 11న పీజీఐ పోలీస్ స్టేషన్‌లో ఆమెకు పోస్టింగ్ వచ్చింది. నాలుగు రోజులు సెలవు పెట్టి ఇంటికి వెళ్లిన సరిత శనివారం సాయంత్రం లక్నోకు తిరిగి వెళ్లింది. సోమవారం ఆమె విధులకు హాజరు కావాలి. అయితే ఆదివారం సాయంత్రం ఆమె తన క్వార్టర్స్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఇంటి సమీపంలో మరికొందరు కానిస్టేబుళ్లు ఉన్నారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.


సరిత ఎడమ చేతి మీది రక్త నాళాలను బ్లేడుతో రెండు మూడు సార్లు కోసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చేతి నరం కోసుకున్న అనంతరం ఆమె ఉరివేసుకుంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. సరిత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. 

Updated Date - 2022-05-16T20:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising