ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: కట్టెల కోసం అడవికి వెళ్లిన మహిళ.. అది ఆమె కంట పడటంతో రాత్రికి రాత్రే మిలియనీర్‌ అయిపోయింది!

ABN, First Publish Date - 2022-07-28T19:18:49+05:30

ఆమె ఒక గిరిజన మహిళ. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కూలీ పనులు చేయడం ద్వారా కుటుంబ పోషణలో భర్తకు అండగా నిలిస్తుంది. పనులు దొరకని రోజు పక్కనే ఉన్న అడవికి వెళ్లి.. కట్టెలు సేకరించి వాటిని సంతలో అమ్మి డబ్బులు పొందుతుంది. కొన్నేళ్లుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఒక గిరిజన మహిళ. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కూలీ పనులు చేయడం ద్వారా కుటుంబ పోషణలో భర్తకు అండగా నిలిస్తుంది. పనులు దొరకని రోజు పక్కనే ఉన్న అడవికి వెళ్లి.. కట్టెలు సేకరించి వాటిని సంతలో అమ్మి డబ్బులు పొందుతుంది. కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పని ఇదే. అయితే.. ఎప్పటిలాగే కట్టెల కోసం అడవికి వెళ్లిన ఆమెను అదృష్టం పలకరించింది. దీంతో రాత్రికి రాత్రే ఆమె మిలియనీర్‌గా మారిపోయింది. స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


జెండా బాయ్( Genda Bai) అనే గిరిజన మహిళ.. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఉన్న పన్నా నగర్ ప్రాంతంలో భర్తతో కలసి నివసిస్తోంది. స్థానికంగా ఎటువంటి కూలీ పనులు దొరక్కపోవడంతో బుధవారం రోజు సాయంత్రం ఆమె.. కట్టెల కోసం అడవికి వెళ్లింది. ఈ క్రమంలో  మెరుస్తూ ఓ రాయి ఆమె కంటపడింది. దాన్ని చూసి ముచ్చటపడ్డ ఆమె.. కొంగున కట్టుకుని ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం భర్తకు ఆ రాయిని చూపించింది. భార్యభర్తలు ఇద్దరూ గంటలపాటు ఆ రాయిని పరిశీలించి చూశారు. కానీ అదేంటో.. ఎందుకలా మెరుస్తుందో వారికి అర్థం కాలేదు. దీంతో ఉదయాన్నే  టౌన్‌లో ఉన్న డైమండ్ ఆఫీస్‌(Diamond Office) కు వెళ్లింది. అక్కడ ఉన్న అధికారికి దాన్ని చూపించగా.. వారికి అసలు విషయం తెలిసింది.



దంపతులు ఇచ్చిన రాయిని పరీక్షించిన అధికారి.. దాన్ని డైమండ్‌(Diamond)గా తేల్చేశాడు. మీకు దొరికింది.. 4.29 క్యారెట్ల డైమండ్ అని అధికారి ఆ దంపతులకు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతేకాకుండా ఈ డైమండ్ విలువ సుమారు రూ.20లక్షల వరకు ఉంటుందని చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై పోయారు. వేలం పాట గురించి డైమండ్‌ను డైమండ్ ఆఫీస్‌లో వదిలి తిరిగి ఇంటికి పయనమయ్యారు. కాగా.. వేలం పాట(Auction) పూర్తైన తర్వాత చట్టబద్ధంగా వచ్చే డబ్బులను ఆ దంపతులకు ఇవ్వనున్నట్టు అధికారి చెప్పాడు. ఈ క్రమంలో జెండా బాయ్ మాట్లాడుతూ.. వేలం పాటలో వచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకున్నాని.. తన నలుగురు కొడుకుల భవిష్యత్తు కోసం ఆ మొత్తాన్ని ఖర్చు చేస్తానని చెప్పింది. 


Updated Date - 2022-07-28T19:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising