ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమెకు 35 ఏళ్లు.. అతడికి 19 ఏళ్లు.. రాత్రంతా పార్టీ చేసుకున్నారు.. తెల్లవారుజామున చంపేశాడు..!

ABN, First Publish Date - 2022-09-15T20:30:58+05:30

ఆమెకు 35ఏళ్లు.. అతడికేమో 19 సంవత్సరాలు. పెళ్లైనా ఆమె అతడిపై మనసు పారేసుకుంది. దీంతో గత ఏడాదిగా ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. ఈ క్రమంలో భర్త లేని సమయం చూసి తాజాగా అతడిని ఆమె రాత్రి ఇంటికి పిలిచింది. రాత్రంతా ఇ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 35ఏళ్లు.. అతడికేమో 19 సంవత్సరాలు. పెళ్లైనా ఆమె అతడిపై మనసు పారేసుకుంది. దీంతో గత ఏడాదిగా ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. ఈ క్రమంలో భర్త లేని సమయం చూసి తాజాగా అతడిని ఆమె రాత్రి ఇంటికి పిలిచింది. రాత్రంతా ఇద్దరూ పార్టీ చేసుకున్నారు. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకోవడంతో.. ఆమెను అతడు హతమార్చాడు. స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కోర్బా(Korba) జిల్లాలో ఈ ఘటన చోటు చేసకుంది. పాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్‌దహాపరా రామ్‌పూర్ గ్రామానికి చెందిన 35ఏళ్ల వివాహిత తన కంటే దాదాపు 15ఏళ్లు తక్కువ వయసు ఉన్న యువకుడితో ఏడాది క్రితం ప్రేమలో పడింది. దీంతో ఇద్దరూ ఏడాదిపాటు ప్రేమాయణం(Love) సాగించారు. తాజాగా వివాహిత భర్త ఓ పని నిమిత్తం పొరుగున ఉన్న మరో ఊరికి వెళ్లాడు. దీంతో ఆ వివాహిత రాత్రి ఇంటికి రావాల్సిందిగా తన ప్రియుడికి కబురు పంపింది. అది విని యువకుడు వెంటనే ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. 



ఈ క్రమంలో ఇద్దరూ చికెన్ తింటూ మద్యం తాగుతూ రాత్రంతా పార్టీ చేసుకున్నారు. ఉదయం 3 గంటల సమయంలో యువకుడు తన ఇంటికి బయల్దేందుకు సిద్ధం అయ్యాడు. అయితే.. అతడిని వివాహి(Married Woman) అడ్డగించింది. ఉదయం 5 గంటల వరకు అతడిని వెళ్లనీయకుండా అడ్డుపడింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు.. వివాహితను హత్య చేశాడు. అనంతరం శవాన్ని దాచేందుకు ప్రయత్నిస్తూ చుట్ట పక్కల వాళ్ల కంట్లో పడ్డాడు. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి అతడు పరారయ్యాడు. కాగా.. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అధికారులు... మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. యువకుడి కోసం గాలింపు ప్రారంభించారు. కొద్ది గంటల్లోనే అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2022-09-15T20:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising