ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో వైన్ ఆర్డర్ చేసిన మహిళ.. ఏకంగా రూ.4.8 లక్షలు మాయం

ABN, First Publish Date - 2022-04-10T08:54:12+05:30

ప్రస్తుతం దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. అమాయకులను మోసగాళ్లు టెక్నాలజీ సహాయంతో చాలా సులభంగా మోసం చేస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఒక బాటిల్ వైన్ ఆర్డర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. అమాయకులను మోసగాళ్లు టెక్నాలజీ సహాయంతో చాలా సులభంగా మోసం చేస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఒక బాటిల్ వైన్ ఆర్డర్ చేసి ఏకంగా రూ.4.8 లక్షలు నష్టపోయింది.. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 


ముంబైలోని పోవై ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆదివారం సాయంత్రం గూగుల్ ద్వారా మద్యం షాపుల గురించి వెతికింది. అందులో ఒక వైన్ షాపు నెంబర్ తీసుకుని కాల్ చేసి వైన్ ఆర్డర్ చేసింది. క్యాష్ ఆన్ డెలివరీని అంగీకరించమని చెప్పడంతో గూగుల్ పే ద్వారా రూ.650 అతనికి పంపింది. కొద్ది సేపటి తర్వాత ఆ మహిళ నెంబర్‌కు అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. 


మీరు రూ.30 ఎక్కువగా పంపించారని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. తను పంపించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని అడిగాడు. బాధిత మహిళ దాన్ని స్కాన్ చేయగా ఆమె ఖాతా నుంచి రూ.19,991 డెబిట్ అయింది. అప్పుడు మహిళ పై నెంబర్‌కు కాల్ చేయగా, పొరపాటున జరిగిందని, మళ్లీ ఒకసారి స్కాన్ చేయమని అడిగాడు. ఈ సారి స్కాన్ చేస్తే ఏకంగా లక్ష రూపాయలు డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత పలుసార్లు ఆమెకు మాయ మాటలు చెప్పి స్కాన్ చేయించి ఏకంగా రూ.4.8 లక్షలు కొట్టేశాడు.  దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 

Updated Date - 2022-04-10T08:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising