ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మగ పిల్లాడి కోసం దారుణం.. తల్లిని చంపి బిడ్డను ఎత్తుకొచ్చేందుకు కుట్ర.. చివరకు..

ABN, First Publish Date - 2022-03-17T08:38:09+05:30

సమాజం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. మగపిల్లాడు పుట్టాలని ఆరాటపడుతున్నారు. మగపిల్లాడు పుట్టలేదని వేధిస్తున్న అత్తింటి వారిని సంతృప్తి పరిచేందుకు ఓ మహిళ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమాజం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. మగపిల్లాడు పుట్టాలని ఆరాటపడుతున్నారు. మగపిల్లాడు పుట్టలేదని వేధిస్తున్న అత్తింటి వారిని సంతృప్తి పరిచేందుకు ఓ మహిళ పెద్ద స్కెచ్ వేసింది. తన చెల్లి, ఆమె ప్రియుడితో కలిసి ఓ హత్యకు పాల్పడింది. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలైంది. 


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని సత్వా జిల్లా కొల్గాన్వా గ్రామానికి చెందిన అర్చనకు వివాహం తర్వాత ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అయితే మగ పిల్లాడు కావాలని అత్తింటి వారు వేధిస్తుండడంతో ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకుండా మూడోసారి గర్భం దాల్చింది. అయితే మూడో నెలలోనే అబార్షన్ జరిగిపోయింది. ఆ విషయం తెలిస్తే అత్తింటి వారు గొడవ చేస్తారనే భయంతో చెల్లి సుధ, ఆమె ప్రియుడు గౌరవ్‌తో కలిసి ఓ పథకం వేసింది. అప్పుడే పుట్టిన ఓ మగ పిల్లాడిని కిడ్నాప్ చేసి తన కొడుకుగా అత్తింటి వారికి చూపించాలనుకుంది. 


సుధ ప్రియుడు గౌరవ్‌కు కిష్ణి అని మహిళతో కూడా సంబంధం ఉంది. ఆమెకు నాలుగు నెలల క్రితం ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది. గౌరవ్ సింగ్, అర్చన, సుధ అందరూ కలిసి కిష్ణి బిడ్డను కిడ్నాప్ చేసేందుకు కుట్ర పన్నారు. కిష్ణికి టీలో 18 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చారు. అనంతరం టీ తాగిన కిష్ణి అపస్మారక స్థితిలో ఉండగా.. ఆమెను గొంతు నులిపి చంపేశారు.


మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఆమె బిడ్డను తీసుకెళ్లిపోయారు. కాగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. దీంతో పోలీసులకు గౌరవ్ గురించి తెలిసింది. పోలీసులు గౌరవ్‌ని పట్టుకొని కఠినంగా ప్రశ్నించగా.. అతను జరిగినదంతా చెప్పాడు. పోలీసులు కిష్ణి హత్య కేసులో గౌరవ్‌తో పాటు అర్చన, సుధను కూడా అరెస్టు చేశారు.

Updated Date - 2022-03-17T08:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising