ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహ వేదిక వద్దకు వధువు వెరైటీ ఎంట్రీ.. ప్రపంచంలోనే అలా ఇంతకు ముందు ఎవరూ చేసి ఉండరేమో!

ABN, First Publish Date - 2022-04-22T02:12:44+05:30

వివాహ వేదిక వద్దకు ఓ వధువు వెరైటీగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్రపం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వివాహ వేదిక వద్దకు ఓ వధువు వెరైటీగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్రపంచంలో ఆమెలా ఇంతకు ముందు బహుశా ఎవరూ చేసి ఉండరు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్ల కామెంట్లు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా.. ఇదే నిజం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే పెళ్లినాటి ఆ మధుర క్షణాలను మరింత మధురంగా మార్చుకోవడానికి వధూవరులు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం వారి వారి స్థాయిలు, ఆలోచనలను బట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. ఇటలీకి చెందిన ఓ వధువు కూడా అచ్చం ఇదే విధంగా ఆలోచించింది. దేవకన్యలా దివి నుంచి భువికి వచ్చి తనను పెళ్లి చేసుకోబోయేవాడి చేయి పట్టుకోవాలని భావించింది. మనసులో మాటను ఈవెంట్ ఆర్గనైజర్లకు చెప్పింది. అందుకోసం వాళ్లు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో సుమారు 250 హీలియం బెలూన్ల ద్వారా వధువు గాల్లో ఎగురుతూ వివాహ వేదికు చేరుకుంది. తెల్లని దుస్తుల్లో తెలుగు రంగు బెలూన్ల మధ్య కూర్చుని ఆమె ఎగురుతూ వేదిక వద్దకు రావడాన్ని చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ ‌చల్ చేస్తోంది. 




Updated Date - 2022-04-22T02:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising