ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెండి మంచం.. బంగారపు గ్లాసులు, కంచాలు... ఈ హోటల్ లో ఒక్క రాత్రికి అయ్యే ఖర్చు ఎంతంటే..

ABN, First Publish Date - 2022-01-01T15:57:43+05:30

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన రాజస్థాన్‌లో నూతన సంవత్సరం సందర్భంగా విదేశీ పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌గా పేరొందిన ‘ది రాజ్ ప్యాలెస్’ లో న్యూఇయర్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆసియాలోనే అత్యంత వైభవంగా నూతన సంవత్సర వేడుకలు ‘ది రాజ్ ప్యాలెస్’లో జరుగుతాయని చెబుతుంటారు. 


 ఈ హోటల్‌లో ఒకరోజు రాత్రి బస చేయాలంటే రూ. 18 లక్షల అద్దె చెల్లించాల్సివుంటుంది. అత్యంత ఆధునిక సదుపాయాలు కలిగిన ఈ హోటల్‌లో బస చేసేవారికి వైభవమైన అతిథి మర్యాదలు చేస్తారు. ప్రత్యేక ఆహారాలను బంగారపు పళ్లాలలో వడ్డిస్తారు. హాటల్‌లో బస చేసే అతిథులకు సత్కారాలు చేసేందుకు ఐదుగురు సిబ్బంది నిరంతరం పనిచేస్తుంటారు. అతిథుల కోసం కళాకారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే వారిని అంత్యంత విలాసవంతమైన వింటేజ్ కారులో కూర్చోబెట్టి రాజస్థాన్ అందాలను చూపిస్తారు. అలాగే ఎలిఫెంట్ సవారీ కూడా చేయిస్తారు. లేక్‌సిటీగా పేరొందిన ఉదయ్‌పూర్‌లో కూడా నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి.

Updated Date - 2022-01-01T15:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising