ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife Left Husband: ఇదో రివర్స్ కేసు.. పోలీస్ జాబ్ రాగానే భర్తను వదిలేసిన భార్య.. ఇదేంటని అడిగితే ఆమె ఏం చెప్తోందంటే..

ABN, First Publish Date - 2022-07-22T16:36:03+05:30

ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధం అవుతూ.. ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా.. చివరకు ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి.. వాళ్ల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తర్వాత అత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధం అవుతూ.. ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా.. చివరకు ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి.. వాళ్ల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తర్వాత అతడికి తన భార్య షాకిచ్చింది. దీంతో ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాకు చెందిన మిథున్ కుమార్ తన చదువు పూర్తైన తర్వాత పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. హర్‌ప్రీత్ అనే యువతి కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారడంతో.. ఇద్దరూ స్థానికంగా ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అనంతరం తమ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారి అంగీకారంతో గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత హర్‌ప్రీత్‌‌కు కానిస్టేబుల్ ఉద్యోగం రాగా.. మిథున్ కుమార్‌కు మాత్రం నిరాశే మిగిలింది. తనకు జాబ్ రాకున్నా.. భార్యకు ఉద్యోగం వచ్చినందుకు అతడు సంబరపడ్డాడు. ఈ నేపథ్యంలో వారి సంసారం కొన్ని రోజుల వరకు బాగానే సాగింది.



 కానీ ఆ తర్వాతే.. హర్‌ప్రీత్‌ తన భర్తను దూరం పెట్టడం మొదలు పెట్టింది. భార్య వైఖరితో ఒక్కసారిగా కంగుతిన్న అతడు.. హర్‌ప్రీత్‌ను నిలదీశాడు. దీంతో ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘నీతో కలిసి ఉండటం ఇష్టం లేదని’ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మిథున్.. పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యతో తనతో కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులును కోరాడు. హర్‌ప్రీత్ ప్రిపరేషన్ కోసం సుమారు రూ.10-15లక్షలు ఖర్చు చేసినట్టు పేర్కొన్నాడు. అయితే హర్‌ప్రీత్ మాత్రం అతడి మాటలను ఖండించింది. రూ.25లక్షలు కావాలంటూ తన భర్త డిమాండ్ చేసినట్టు ఆరోపించింది. డబ్బులు ఇవ్వకపోతే తనను చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని తెలిపింది. అంతేకాకుండా తన భర్తకు మరో యువతితో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేసింది. 


Updated Date - 2022-07-22T16:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising