ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్ సిమ్‌కి ఒక అంచున కట్ ఎందుకు ఉంటుందో తెలుసా? దాని రహస్యం ఏమిటో తెలిస్తే...

ABN, First Publish Date - 2022-09-25T16:33:22+05:30

మొబైల్ సిమ్ కార్డులో ఒక అంచున కట్ మార్క్ కనిపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్ సిమ్ కార్డులో ఒక అంచున కట్ మార్క్ కనిపిస్తుంది. అలా ఎందుకు ఉంటుందోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు ప్రత్యేక ప్రయోజనం కోసం సిమ్‌ కార్డులను ఇలా తయారు చేస్తాయి. కాలంతో పాటు టెక్నాలజీలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయి. మొబైల్ సిమ్ కార్డ్‌ల  రూపురేఖల విషయానికొస్తే మొదట్లో దీర్ఘచతురస్రాకారంలో సాధారణ సిమ్‌లు ఉండేవి. 


తరువాత సిమ్ పరిమాణంలో స్వల్ప మార్పు వచ్చింది. సాధారణ సిమ్‌లోని ఒక అంచుకు కటింగ్ వచ్చింది. అంతేకాదు సిమ్ పెట్టే స్లాట్‌లోనూ అదే డిజైన్‌ను ఇచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సిమ్ అలా ఎందుకు మార్చారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తొలినాళ్లలో సిమ్‌ ఇన్‌స్టాల్‌ చేయాల్సిన అవసరం లేని ఫోన్‌లను పోస్ట్‌పెయిడ్‌ ఫోన్‌లుగా పిలిచేవారు. ఆ తర్వాత ప్రీపెయిడ్ ఫోన్ల ట్రెండ్ మొదలు కావడంతో  కంపెనీలు సిమ్‌లను తయారు చేయడం ప్రారంభించాయి. సిమ్‌కి నాలుగు మూలలు సమానంగా ఉండడంతో స్లాట్‌లో పెట్టేటప్పుడు ఎలా పెట్టాలనేది వినియోగదారులకు అర్థం కాలేదు. దీంతో పలు ఇబ్బందులు ఎదురయ్యేవి. చాలా సందర్భాలలో సిమ్ రివర్స్‌లో పెట్టడం వల్ల, అది ఇరుక్కుపోయి, సిమ్‌లోని చిప్ పాడైపోయేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫోను కంపెనీలు సిమ్ డిజైన్‌ను మార్చాలని ప్లాన్ చేశాయి. ఈ నేపధ్యంలోనే సిమ్‌కు ఒక అంచున కట్ రూపొందించారు. సిమ్ డిజైన్‌లో మార్పు రావడంతో కంపెనీలు మొబైల్‌లో అమర్చిన సిమ్ ట్రేని కూడా మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత దీన్ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయడం సులభం అయ్యింది. ఈ కట్‌తో కూడిన సిమ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. దాదాపు అన్ని కంపెనీలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. 

Updated Date - 2022-09-25T16:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising