పాడె మోసేటప్పుడు ‘రామ్ నామ్ సత్య హై’ అని ఎందుకంటారంటే...
ABN, First Publish Date - 2022-12-31T07:41:50+05:30
ఈ ప్రపంచంలో ప్రతి జీవికి మరణం తప్పదు. ఈ భూమి మీద పుట్టిన మానవుడు తన శరీరాన్ని వదిలి, కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడని హిందువుల నమ్మకం.
ఈ ప్రపంచంలో ప్రతి జీవికి మరణం తప్పదు. ఈ భూమి మీద పుట్టిన మానవుడు తన శరీరాన్ని వదిలి, కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడని హిందువుల నమ్మకం. అయితే రాబోయే జన్మలో ఎవరు ఏ రూపంలో జన్మిస్తారో ఎవరికీ తెలియదు. అయినా మనిషి జీవితాంతం భ్రమల్లో మునిగిపోయి డబ్బు, కీర్తి మొదలైనవాటి వెంటపడుతుంటాడు. ఎవరు ఎంత ప్రయత్నించినా మరణాన్ని తప్పించుకోలేరు. మనిషి తన కర్మలను అనుసరించి తదుపరి జన్మలో దానిని అనుభవిస్తాడు.
మనిషి మృతదేహాన్ని మోసేటప్పుడు వెంట వెళ్లేవారు 'రామ్ నామ్ సత్య హై' అని నినదించడాన్ని మీరు వినే ఉంటారు. మనిషి చివరి మజిలీలో రాముని పేరు ఎందుకు నినదిస్తారో తెలుసా? దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం మనిషి తన జీవితంలో చివరి క్షణంలో భగవంతుని పేరు అంటే రామ నామాన్ని జపించాలి. రామ నామాన్ని జపించడం ద్వారానే జీవితంలో మోక్షం లభిస్తుందనే నమ్మకం హిందువుల్లో బలంగా ఉంది. రామాయణంలో దశరథ మహారాజు తన చివరి క్షణాల్లో రామనామాన్ని జపించి మోక్షాన్ని పొందాడని చెబుతారు.
Updated Date - 2022-12-31T07:41:52+05:30 IST