ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి నక్షత్రాలు కనిపించక పోవడానికి అసలు కారణం తెలిస్తే..

ABN, First Publish Date - 2022-02-08T16:32:08+05:30

గత కొన్నేళ్లుగా ఆకాశంలో నక్షత్రాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొన్నేళ్లుగా ఆకాశంలో నక్షత్రాలు అంతగా కనిపించని విషయాన్ని మీరు గమనించారా? ఇంతకుముందు రాత్రివేళ ఆకాశం నక్షత్రాలతో నిండుగా కనిపించేది. ఇప్పుడు అలా జరగడం లేదు. దీనికి కాలుష్యమే కారణమని చెబుతుంటారు. అలాగే ఆకాశం స్పష్టంగా లేదని కూడా భావిస్తుంటారు. అయితే నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణం నగరాల వెలుగులు అని అని మీకు తెలుసా? అవును.. కాంతి నుంచి వ్యాపించే కాలుష్యం వల్ల ఇది జరుగుతుందని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా డిడబ్ల్యు తెలిపిన వివరాల.. ప్రస్తుతం ప్రపంచంలోని 20 శాతం మంది ప్రజలు మాత్రమే ఆకాశాన్ని.. దాని అసలు రూపంలో చూడగలుగుతున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరికొందరు తమ కళ్లతో స్పష్టమైన ఆకాశాన్ని చూడలేరని కూడా చెబుతున్నారు.


అదే సమయంలో శాస్త్రవేత్తలు.. నగరాల్లో పెరుగుతున్న కృత్రిమ కాంతి కూడా నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణమని చెబుతున్నారు. ఈ కృత్రిమ కాంతి ఆకాశంలోని చీకటిని అంతం చేసిందంటున్నారు. ప్రస్తుతం నగరాల్లో రాత్రి వేళ నక్షత్రాలతో ప్రకాశించే ఆకాశపు కాంతి కన్నా.. కృత్రిమ కాంతి 40 రెట్లు ఎక్కువ. ఈ కాంతి ప్రతి సంవత్సరం 2.2 శాతం చొప్పున పెరుగుతున్నదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వల్ల చీకటి తగ్గడమే కాదు, నానాటికీ పెరుగుతున్న వెలుతురు వల్ల మన పర్యావరణ వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ కృత్రిమ కాంతి పక్షులు, చెట్లు, మొక్కల వరకు అన్నింటినీ ప్రభావితం చేస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా అంతరిక్షంలో 70 వేల బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి.

Updated Date - 2022-02-08T16:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising