ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెన్నెలలో కూర్చున్నప్పుడు ఆ విషయాన్ని గమనించారా? చంద్రుని ఆకారం రోజురోజుకు ఎందుకు మారిపోతుందో మీకు తెలుసా?

ABN, First Publish Date - 2022-01-04T18:02:59+05:30

చంద్రుని పరిమాణం ఎందుకు మారుతుందో తెలుసుకునే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్పునొందే చంద్రుని ఆకారం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజూ చంద్రుడు ఒకే విధంగా ఎందుకు కనిపించడు? చంద్రుడు వెన్నెలను ఎందుకు కురిపిస్తాడు? ఈ ప్రశ్నలకు మీకు సమాధానం తెలుసా? కాలానుగుణంగా మారే పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

చంద్రుని పరిమాణం ఎందుకు మారుతుందో తెలుసుకునే ముందు అది ఎందుకు ప్రకాశిస్తుందో తెలుసుకోవాలి. నిజానికి చంద్రునికి స్వయం ప్రకాశిత శక్తిలేదు. సూర్యుని నుంచి వచ్చే కాంతి చంద్రునిపై పడుతుంది. అది పరావర్తనం చెంది భూమిపై పడుతుంది. ఈ కాంతి ప్రతిబింబం వల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నట్లు మనకు కనిపిస్తాడు. చంద్రుడు భూమి చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి 30 రోజులు పడుతుంది. అలా తిరుగుతున్నప్పుడు.. చంద్రుడు క్రమంగా భూమి- సూర్యుని మధ్యకు వస్తాడు. ఈ ప్రదక్షిణ సమయంలో వివిధ కోణాలు ఏర్పడతాయి. ఈ కోణం కారణంగా చంద్రునిపై సూర్యకిరణాలు ఏమేరకు పడతాయో చంద్రుడు ఆ మేరకే కనిపిస్తాడు. దీనిని చంద్రుని దశలు అని అంటారు. ఆ కోణాన్ని అనుసరించి చంద్రుడు వివిధ సైజుల్లో కనిపిస్తాడు.


చంద్రుడు తన కక్ష్యలో భూమికి ఎదురుగా వచ్చినప్పుడు, సూర్యుడి నుండి వచ్చే కిరణాలు భూమిపై ప్రతిబింబించవు. అప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. అంటే చంద్రుడు గుండ్రంగా ఉండి, దాని ఆకారం స్థిరంగా ఉన్నా సూర్య కిరణాల పరావర్తనం వల్ల ఇలా జరుగుతుందని అర్థం. భూమి.. సూర్య చంద్రుల మధ్యకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది జరిగినప్పుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడదు, ఫలితంగా కిరణాలు ప్రతిబింబించవు. దీనినే చంద్రగ్రహణం అంటారు. 

Updated Date - 2022-01-04T18:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising