ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెమలి ఈకలకు బల్లులు భయపడి పారిపోతాయా? ఇది అపోహ లేక వాస్తవమా?

ABN, First Publish Date - 2022-02-09T14:28:12+05:30

చాలా ఇళ్లలో బల్లుల కారణంగా ఆ ఇంటిలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా ఇళ్లలో బల్లుల కారణంగా ఆ ఇంటిలోని వారు చాలా ఇబ్బందులు పడటం చూసే ఉంటాం. అటువంటి సందర్భాల్లో బల్లులను బయటకు తరిమికొట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిలో ఒకటే నెమలి ఈకలను వినియోగించడం. ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వల్ల బల్లుల బయటకు పోతాయని చెబుతుంటారు. ఫలితంగా చాలా మంది తమ ఇళ్లలో నెమలి ఈకలను పెట్టుకుంటుంటారు. ఇంతకీ నెమలి ఈకలను చూసి బల్లులు ఎందుకు పారిపోతాయని చెబుతారో తెలుసా? ఈ పద్ధతి బల్లిని తరిమికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటుందని కూడా పలువురు చెబుతుంటారు. ఇప్పుడు ఈ వాదనలోని నిజానిజాలను తెలుసుకుందాం. నెమలి ఈకలను చూసి బల్లుల భయపడటానికి కారణం నెమలి ఈక రూపకల్పన అని చాలా రిపోర్టులలో పేర్కొన్నారు. 


నెమలి ఈక పైభాగంలో కన్నులా కనిపిస్తుంది. బల్లి దానిని చూసి.. అదేదో పెద్ద జంతువు కన్నుగా భావించి భయపడుతుందని చెబుతారు. అందుకే అది నెమలి ఈక దగ్గరికి రాదంటారు. మరికొందరు నెమలి ఈక నుంచి వచ్చే వాసన కారణంగా బల్లి వాటికి దూరంగా ఉంటుందని అంటుంటారు. ఇదేవిధంగా నెమళ్ళు బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు అవి బల్లులను తింటాయని.. అటువంటి పరిస్థితిలో బల్లులు.. నెమళ్లకు దూరంగా ఉంటాయని కూడా తెలుస్తోంది. అందుకే నెమలి ఈకను చూసి బల్లులు భయపడతాయని చెబుతారు. ఇటువంటి కారణాలతో బల్లులు నెమలి ఈకలకు దూరంగా ఉంటాయని పలువురు చెబుతుంటారు. అయితే వీటి వెనుక ఎటువంటి శాస్త్రీయ కారణం లేదని నిపుణులు చెబుతారు. అలాగే చాలా రిపోర్టులు కూడా ఈ వాదనలను ఖండించాయి బల్లులు నెమలి ఈకలకు భయపడతాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పాయి. యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోలు చాలా కనిపిస్తుంటాయి. అందులో బల్లి నెమలి దగ్గర చాలా సేపు తిరుగుతూనే ఉంటుంది. దాని మీద కూడా కూర్చుంటుంది. దీనిని చూస్తే.. నెమలి ఈకలకు బల్లులు భయపడవని స్పష్టమవుతుంది.



Updated Date - 2022-02-09T14:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising