ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదులు, చెరువులలో నీరు వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వేడిగా ఎందుకు ఉంటుందో తెలుసా?

ABN, First Publish Date - 2022-04-04T14:59:47+05:30

వేసవి, శీతాకాలాల్లో నదుల నీటిలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి, శీతాకాలాల్లో నదుల నీటిలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. వేసవిలో నదులు, చెరువులలోని నీరు చల్లగా మారుతుంది. శీతాకాలంలో గోరువెచ్చగా మారుతుంది. ఇదివిన్నప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందని మన మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది. శీతాకాలంలో వాతావరణంలోని గాలి మంచుతో నిండినప్పటికీ, నేల తడిగా ఉన్నప్పటికీ నదులలోని నీరు వెచ్చగా ఉంటుంది. అదేవిధంగా వేసవిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటినా చెరువు, నదులలో నీరు చల్లగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు వివరంగా తెలిపారు. వేసవిలో నీరు వేడిగా మారకుండా గరిష్ట ఉష్ణోగ్రతను భరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నదులలోని నీటిని వేడి చేయడానికి ఎక్కువ శక్తి అవసరం. 


అందువల్ల, నదులు, చెరువులలోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు జనం నదులు, నీటి కుంటల ఒడ్డుకు చేరుకోవడానికి ఇదే కారణం. చలికాలంలో నీరు ఎందుకు గోరువెచ్చగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నాం. నీటి ఉష్ణోగ్రత దాని అణువుల వేగంపై ఆధారపడి ఉంటుంది. దాని అణువులు ఎంత వేగంగా కదులుతాయో.. నీటి ఉష్ణోగ్రత అంత ఎక్కువగా ఉంటుంది. అయితే నీటి అణువులు నిదానంగా ఉన్నప్పుడు, అవి కలిసి ఉంటాయి. ఇది జరిగినప్పుడు, నీటి వేడి అంటే ఉష్ణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బాహ్య వాతావరణం నీటి ఉష్ణోగ్రతను ప్రభావితం చేయదు. ఒక నివేదిక ప్రకారం వాతావరణం వేడిగా లేదా చల్లగా ఉన్నప్పుడు అది భూమి కింద ఉన్న నీటిని ప్రభావితం చేయదు. వేసవిలో భూగర్భంలో ఉండే నీరు చల్లగానూ, చలికాలంలో గోరువెచ్చగానూ ఉండడానికి కారణం ఇదే. శీతాకాలంలో నదులు. చెరువుల నీటి ఉపరితలం నుండి ఆవిరి పెరగడానికి గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో నదులు, సముద్రపు నీరు గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉండదు. అందుకే సముద్రపు ఉపరితలంపైనున్న గాలి  వెచ్చగా ఉంటుంది. ఈ వేడి చల్లని వాతావరణం కారణంగా, నీరు ఆవిరైపోతుంది. ఇది దూరం నుండి చూస్తే వాయువుగా కనిపిస్తుంది.

Updated Date - 2022-04-04T14:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising