ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనందాన్ని, విచారాన్ని వ్యక్తం చేసేటప్పుడే కాదు... కనుబొమలు ఇలా కూడా పనిచేస్తాయని తెలిస్తే..

ABN, First Publish Date - 2022-01-18T14:58:36+05:30

మనిషి ముఖంపై కనిపించే కనుబొమల పనితీరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి ముఖంపై కనిపించే కనుబొమల పనితీరు ఏమిటి? అనే ప్రశ్న అడిగితే ప్రశ్నకు చాలామంది.. ఇవి ఆ వ్యక్తి అందంగా కనిపించడానికి సహాయపడతాయంటారు. మరికొందరైతే కనుబొమలు ఆ వ్యక్తి మానసిక స్థితిని తెలియజేస్తాయని.. అతను కోపంగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? లేదా ఒత్తిడిలో ఉన్నాడా అనేది తెలుస్తుందంటారు. అయితే సైన్స్ కోణం నుండి చూస్తే దీనికి అనేక సమాధానాలు కనిపిస్తాయి. ది కన్వర్జేషన్ తెలిపిన వివరాల ప్రకారం కనుబొమలు కళ్ళను పరిరక్షించడానికి పని చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో నుదుటిపై దుమ్ముతో కూడిన చెమట వస్తుంది. అది కళ్ల వైపునకు దిగుతున్నప్పుడు దానిని ఆపడానికి కనుబొమలు తోడ్పడుతాయి. ఈ విధంగా కంటికి రక్షణ లభిస్తుంది. అదేవిధంగా చలికాలంలో పొగమంచు బిందువులు కళ్లలోకి రాకుండా కనుబొమలు కాపాడతాయి.


అంతేకాదు కనుబొమలపై దుమ్ము చేరిన వెంటనే దాని ప్రత్యక్ష ప్రభావం కళ్లపై కనిపిస్తుంది. ఇది జరిగినప్పుడు రెండు కళ్ళు మూసుకుంటాయి. ముఖంలోని భావాల వ్యక్తీకరణను మార్చడంలో కనుబొమలకు సంబంధించిన కండరాలు సహకరిస్తాయి. కనుబొమల సహాయంతో మనిషి తన ముఖంలోని భావాలను వ్యక్తపరచగలడు. కనుబొమలు ఒక వ్యక్తి గుర్తింపును కూడా నిర్ణయిస్తాయి. పురుషులలో వెడల్పయిన కనుబొమలు, స్త్రీలలో సన్నని కనుబొమలు ఉంటాయి. అవి వారి ప్రత్యేకతను చాటుతాయి. వయసు పెరుగుదలతో పాటు కనుబొమల ఆకృతి కొంతవరకు మారుతుంది. పెరుగుతున్న వయసు ప్రభావం కనుబొమలలోనూ కనిపిస్తుంది.



Updated Date - 2022-01-18T14:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising