ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేలి ముద్రల్లో దాగున్న వేల రహస్యాలు.. కాలినా, తెగినా, గాయమైనా వాటిని ఎందుకు మార్చలేమో తెలుసా?

ABN, First Publish Date - 2022-01-02T16:30:18+05:30

వేలిముద్రలు ఎంతో శక్తివంతమైనవి. అవి బలమైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలిముద్రలు ఎంతో శక్తివంతమైనవి. అవి బలమైన పాస్‌వర్డ్‌గా ఉపయోగపడుతున్నాయి. కార్యాలయాల్లో హాజరు కోసం వేలిముద్రను ఉపయోగిస్తుంటారు. చేతి వేళ్లు కాలినపుడు, వేళ్లపై యాసిడ్ పడినప్పుడు లేదా వేళ్లకు గాయమైనప్పుడు మన వేలిముద్రలు మారుతాయా? ఒక వ్యక్తి వేలిముద్ర మరొక వ్యక్తి వేలిముద్రతో ఎందుకు సరిపోలివుండదు? జీవితాంతం మన వేలిముద్రలు ఒకేలా ఉంటాయా? అనే ప్రశ్నలు అందరిమదిలోనూ మెదలుతుంటాయి. వాటికి ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.


వేలిముద్రలు ఎందుకు ప్రత్యేకంగా ఉంటాయి? 

ఒక వ్యక్తి వేలిముద్ర మరొకరి వేలిముద్రతో ఎందుకు సరిపోలదు? ఈ విషయం గురించి.. వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ ఎం. కాన్లీ వివరణ ఇచ్చారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. మానవ జన్యువులు, పర్యావరణం తదితర అంశాలు దీని వెనుక కారణాలుగా నిలిచాయి. ప్రతి ఒక్కరి వేలిముద్రలు భిన్నంగా ఉండటాన్ని పలు అంశాలు నిర్థారిస్తాయి. శిశువు గర్భస్థ దశ పెరుగుదల స్థితిలో ఉన్నప్పుడే వేలిముద్రలు రూపొందుతాయి. మానవ చర్మం రెండు పొరలతో కూడుకుని ఉంటుంది. మొదటిది - బాహ్యచర్మం. రెండవది అంత:చర్మం. ఈ రెండూ కలిసే వృద్ధి చెందుతుంటాయి. ఈ రెండు పొరల నుంచి తయారైన చర్మం కారణంగా వేలిముద్రల ఉబ్బెత్తు రూపొందుతుంది. ఏదైనా సమస్య కారణంగా చేతి వేలిముద్రలు మాయమైతే.. కొన్ని నెలలకే అవి తిరిగి పాత రూపాన్ని సంతరించుకుంటాయి. ఉదాహరణకు ఎవరికైనా చేయి కాలితే, చేయిపై యాసిడ్ పడినా లేదా గాయం అయినా.. నెల రోజుల వ్యవధిలో అతని  వేలిముద్రలు యధాస్థితికి చేరుకుంటాయి. మనిషి వేలిముద్ర వయసుతోపాటు మారుతుందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంటుంది. చిన్న వయసులో వేలిముద్రలు మారేందుకు అవకాశం ఉంటుందని, వయసు పెరిగే కొద్దీ వేలిముద్రలు మార్పునొందే గుణాన్ని కోల్పోయి, ఒకే రీతిలో ఉంటాయని సైన్స్ చెబుతోంది.

Updated Date - 2022-01-02T16:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising