ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెయింటర్స్ దుస్తులు తెలుపు రంగులోనే ఎందుకుంటాయంటే..

ABN, First Publish Date - 2022-05-16T16:09:23+05:30

ఇళ్లలో, బంగ్లాలలో రంగులు వేసే పెయింటర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్లలో, బంగ్లాలలో రంగులు వేసే పెయింటర్లు తెల్లటి దుస్తులతో పాటు తెల్లటి టోపీని ధరిస్తారు. ఈ ప్రొఫెషనల్ పెయింటర్  దుస్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. పెయింటింగ్ వేసేటప్పుడు గోడలకు రకరకాల రంగులు వేస్తారని, అలాంటప్పుడు వారి దుస్తులు ముదురు రంగులో ఎందుకు ఉండవని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలుపు రంగును పరిశుభ్రతకు చిహ్నంగా భావిస్తారు.


పెయింటర్లు తెలుపురంగు దుస్తులను ధరించడం ద్వారా మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు. దీనికి మరో కారణం కూడా ఉంది. 17వ శతాబ్దంలో పెయింటర్లు తమ దుస్తులను ఓడల్లో ఉపయోగించే తెల్లటి గుడ్డతో కుట్టించుకునేవారట. పనులు చేసే సమయంలో వాటినే ధరించేవారని, అందుకే ఈ రంగు ఆచారంగా మారిందని చెబుతుంటారు. పెయింటింగ్ స్పెషలిస్ట్ వెబ్‌సైట్ తెలిపిన ప్రకారం,  భవనాల్లో పెయింటింగ్‌లు వేసే సందర్భంలో పెయింటర్లు నేరుగా ఎండవేడిమికి గురవుతారు. తెలుపు రంగు దుస్తులు వేడి ప్రభావాన్ని నియంత్రిస్తాయి. ఈ కారణంగా తెలుపు దుస్తులు వేసుకునే ట్రెండ్ ప్రారంభమయ్యిందంటారు. మరోవైపు తెలుపు రంగు వస్త్రం చాలా చౌకగా, ఎక్కడైనా లభిస్తుంది. ఈ కారణాల దృష్ట్యా పెయింటర్స్ తెలుపురంగు దుస్తులు ధరిస్తారు. 

Updated Date - 2022-05-16T16:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising