ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలు అమ్మ అనే పదాన్నే ముందుగా ఎందుకు పలుకుతారో తెలుసా?

ABN, First Publish Date - 2022-02-13T17:54:51+05:30

చిన్న పిల్లలకు నోటి నుండి వచ్చే మొదటి పదం 'మా'..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న పిల్లలకు నోటి నుండి వచ్చే మొదటి పదం 'మా' లేదా 'అమ్మ'. ఇలా పలకడం వెనుక కారణం ఏమిటి? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబం, మానవాభివృద్ధిపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు దీనికి గల కారణాలను తెలుసుకున్నారు. దీనివెనుకనున్న అసలు కారణాన్ని తెలుసుకునే ముందు.. చాలా భాషల్లో అమ్మ నాన్న అనే పిలుపు కోసం ఉపయోగించే పదాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. తెలియని దేశానికి వెళ్లి అమ్మ అనే పదాన్ని పలికితే.. అమ్మ గురించి మాట్లాడుతున్నట్లు అక్కడి వారికి అర్థం అవుతుంది. ఇదేవిధంగా ప్రపంచంలో తండ్రికి సంబంధించి కూడా దాదాపు ఒకేలాంటి పదాలు ఉన్నాయి. ఉదాహరణకు పాప, బాబా, నాన్న మొదలైనవి. తల్లిదండ్రులకు సంబంధించిన 1072 ఏకరూప పదాలను గుర్తించారు. ఈ విషయాన్ని గ్రహించిన ఘనత జార్జ్ పీటర్ మర్డోక్ అనే సైకాలజిస్ట్‌కి దక్కుతుంది. మర్డోక్ 1940లలో చాలా దేశాల్లో పర్యటించాడు. ఈ సమయంలో అతను వివిధ ప్రదేశాలలో తల్లిదండ్రులకు సంబంధించిన 1072 పదాలను గుర్తించాడు. భాషలపై మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి ఈ పదాలను పరిశీలన కోసం ఇచ్చాడు. తరువాత దీనిపై అధ్యాయనం సాగింది. పిల్లలు మొదటగా మాట్లాడే మాటలను వారు గమనించారు. వారు తొలుత ఎం, బి, పి అనే అక్షరాలతో మొదలయ్యే పదాలే పలుకుతారని గుర్తించారు. అలాగే పిల్లలు.. టీ, డీ అక్షరాలతో ప్రారంభమయ్యే పదాలు తొలుత మాట్లాడతారని గుర్తించారు. 




Updated Date - 2022-02-13T17:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising