ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరటి పండే కదా అని.. మిగిలిన పండ్ల పక్కనే ఉంచుతున్నారా? ఈ విషయం తెలిస్తే వెంటనే మీ అలవాటు మార్చుకుంటారు!

ABN, First Publish Date - 2022-01-02T13:54:43+05:30

మనం ఇంటికి వివిధరకాల పండ్లను తీసుకువచ్చినప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం ఇంటికి వివిధరకాల పండ్లను తీసుకువచ్చినప్పుడు ఇతర పండ్లతో కలిపి అరటిపండ్లను కూడా ఉంచుతుంటాం. అయితే సైన్స్ కోణం నుంచి చూస్తే, అలా చేయడం సరైనది కాదు. అరటిపండ్ల నుంచి ఈథేన్ గ్యాస్ వెలువడుతుందని  విజ్ఞానశాస్త్రం చెబుతోంది. పండ్లు త్వరగా మగ్గిపోవడానికి ఈ వాయువే ప్రధాన కారణం.  అయితే అరటిపండ్లను ఇతర పండ్లతో పాటు ఉంచినప్పుడు.. దీని నుంచి వెలువడే వాయువు ఇతర పండ్లపై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటిపండు నుంచి వెలువడే వాయువు.. దానిని త్వరగా మెత్తబడి, పండిపోయేలా చేస్తుందని విజ్ఞానశాస్త్రం చెబుతోంది. అటువంటి పరిస్థితిలో అరటిపండులో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుంది. అందుకే దానిలో తీపి పెరుగుతుంది. కొద్దిరోజులకే అది పండిపోతుంది. అలాగే పండు మృదువుగా మారిపోతుంది. అందుకే అరటి పండును ఇతర పండ్లతో పాటు ఉంచినపుడు అవి త్వరగా పండిపోతాయి. అరటిపండు నుంచి వెలువడే వాయువే దీనికి ప్రధాన కారణం. అయితే అరటిపండ్ల పక్కన ఉంచిన పండ్లన్నీ పండిపోతాయా? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.. 


అరటి పండ్ల పక్కన ఉంచిన చాలా పండ్లపై ఈథేన్ గ్యాస్ ప్రభావం పడుతుంది. ఉదాహరణకు అరటిపండు పక్కన ఆపిల్‌ను ఉంచి, కొన్ని గంటల తరువాత పరిశీలిస్తే.. ఆపిల్ పండిపోయినట్లు కనిపిస్తుంది. అలాగే అది మెత్తగా మారిపోతుంది. అయితే  అరటి పండ్ల పక్కన నారింజ, నిమ్మకాయలు ఉంచినప్పటికీ వాటిపై ఈథేన్ గ్యాస్ ప్రభావం పడదు. అరటిపండు లైట్ చాక్లెట్ కలర్ (buff colour)లోకి ఎందుకు త్వరగా ఎందుకు మారిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండ్లపై పరిశోధనల సాగిస్తున్నయూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు డాక్టర్ డాన్ బెబర్ తెలిపిన వివరాల ప్రకారం అరటిపండులో పాలీఫెనాల్ ఆక్సిడేస్ ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ అరటిపండ్లలో ఉండే ఫినాలిక్ రసాయనాన్ని ఆక్సిజన్ సహాయంతో క్వినోన్‌లుగా మారుస్తుంది. ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరిగిన తర్వాత, ఈ రసాయన ప్రభావం కారణంగా, అరటి పండు.. రంగుమారడం ప్రారంభమవుతుంది.

Updated Date - 2022-01-02T13:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising