ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లి ఏడ‌వ‌డం చెడుకు సంకేత‌మా? ఏవైనా భయంక‌ర ప‌రిణామాలు జ‌రుగుతాయా? సైన్స్ ఏమి చెబుతోందంటే....

ABN, First Publish Date - 2022-11-17T11:03:07+05:30

మ‌నిషి అయినా లేదా జంతువు అయినా ఏడుపు అనేది సహజమైన ప్రక్రియ. భావోద్వేగంలో లేదా ఏదైనా శారీరక సమస్య ఉన్నప్పుడు కన్నీటి గ్రంధులు చురుకుగా మారతాయి. ఏడుపు అనేది నెగటివ్ ఎనర్జీకి సంబంధించిన అంశ‌మే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ‌నిషి అయినా లేదా జంతువు అయినా ఏడుపు అనేది సహజమైన ప్రక్రియ. భావోద్వేగంలో లేదా ఏదైనా శారీరక సమస్య ఉన్నప్పుడు కన్నీటి గ్రంధులు చురుకుగా మారతాయి. ఏడుపు అనేది నెగటివ్ ఎనర్జీకి సంబంధించిన అంశ‌మే. ఒక వ్యక్తి ఏడుస్తుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. జంతువు ఏడుపును వ్యక్తపరచదు. అందుకే దాని చేష్ట‌ల‌ను బట్టి అది ఇబ్బందుల్లో ఉన్న‌ద‌ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మ‌నం పిల్లి ఏడుపు గురించి తెలుసుకుందాం. పిల్లి ఏడుపు గురించి చాలా క‌థ‌నాలు వినిపిస్తాయి. పిల్లి ఎందుకు ఏడుస్తుంద‌నే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లులను ఎవ‌రైనా పెంచుకునేంద‌కు వారి ఇంటికి తీసుకువ‌స్తే అది తన కుటుంబం నుండి విడిపోయినందుకు ఏడుస్తుంద‌ట‌. అది ఆ ఇంటిలోనివారితో క‌లిసిపోవ‌డానికి సమయం పడుతుంది.

ఈలోపు అది ఒంటరితనంలో కుమిలిపోతూ ఏడుస్తుంద‌ట‌. అటువంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు పిల్లి ఒత్తిడిలో కూరుకుపోతుంది. జంతువులు, మొక్కలు అనారోగ్యానికి గురవుతాయి. అయితే మ‌నిషి తన సమస్యను పదాలతో కమ్యూనికేట్ చేస్తాడు. అయితే జంతువు ఏడ‌వ‌డం ద్వారా తన సమస్యను వ్య‌క్తం చేస్తుంది. పిల్లి కూడా ఏడుస్తూ తన బాధను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. వృద్ధాప్యంలో మనుషుల మాదిరిగానే జంతువులలో కూడా శారీరక సమస్యలు పెరుగుతాయి. పిల్లులు వృద్ధాప్యం కారణంగా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటాయి. అందుకే అవి ఏడుస్తుంటాయి. గర్భం దాల్చిన పిల్లుల శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి.

ఆ మార్పులను ఎదుర్కోవడంలో పిల్లులు ఇబ్బంది పడతాయి. ఈ కారణంగా, ఆది ఉద్విగ్నతకు గురై ఏడుస్తుంది. పిల్లలు ఆక‌లితో ఉన్న‌ప్పుడు ఏడుస్తాయి. పిల్లులు నిజంగా రాత్రిపూట ఎక్కువగా ఏడుస్తాయా? అనే ప్ర‌శ్న‌కు నిపుణులు సమాధానమిచ్చారు. పిల్లి ఒంట‌రిత‌నానికి గురైన‌ప్పుడు ఏడుస్తుందని తెలిపారు. పిల్లి ఏడుపు ప్రతికూల శక్తిని సృష్టిస్తుందని కొంద‌రు నమ్ముతారు. కుటుంబానికి ఇది ఏమాత్రం మంచిది కాద‌ని చెబుతారు. తంత్ర-మంత్ర అభ్యాసకులు పిల్లిని నెగిటివ్ శక్తికి చిహ్నంగా భావిస్తారు. పిల్లి ఏడ్చినట్లయితే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చెప్పేవారు కూడా ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను పిల్లి ముందే త‌న ఏడుపు ద్వారా చెబుతుంద‌ని కూడా అంటారు. అయితే సైన్స్‌ని నమ్మేవాళ్లు ఇలాంటి న‌మ్మకాల‌ను కొట్టిపారేస్తారు.

Updated Date - 2022-11-17T11:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising