ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో, స్ట్రాబెరీ ఐస్‌క్రీంలు ఉంటాయి గానీ గ్రేప్ ఐస్‌క్రీం ఉండదెందుకు? కారణం తెలిస్తే..

ABN, First Publish Date - 2022-01-19T17:25:40+05:30

మీరు మ్యాంగో, స్ట్రాబెరీ, పైనాపిల్ తదితర పండ్లతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు మ్యాంగో, స్ట్రాబెరీ, పైనాపిల్ తదితర పండ్లతో కూడిన ఐస్‌క్రీమ్‌ను చూసేవుంటారు. వాటి రుచి చూసేవుంటారు. అయితే ద్రాక్ష రుచి కలిగిన ఐస్‌క్రీం ఎందుకు అందుబాటులో ఉండదని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచవ్యాప్తంగా ఐస్‌క్రీం గురించి ఇంతగా ప్రయోగాలు జరుగుతున్నదశలో కూడా ద్రాక్ష రుచిగల ఐస్‌క్రీం ఎందుకు తయారు కాలేదు? రీడర్స్ డైజెస్ట్‌లో ఫుడ్ ప్రొఫెషనల్ జిమ్ మమ్‌ఫోర్డ్.. ద్రాక్ష ఐస్‌క్రీం చేయకపోవడానికి అనేక కారణాలను తెలిపారు.  ద్రాక్ష ఐస్‌క్రీం తయారు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది రుచిలో తగినంత ఆదరణ పొందలేదన్నారు. అలాగే రంగు కూడా ఒక ద్రాక్ష ఐస్‌క్రీం తయారీ విఫలవడానికి మరో కారణంగా నిలిచింది.  ద్రాక్ష శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. 


ఐస్‌క్రీమ్‌లో ద్రాక్షను ఉపయోగించినప్పుడు ఈ యాంటీఆక్సిడెంట్ విచ్ఛిన్నమవుతుంది. ఫలితంగా దాని రంగు, రుచిని ప్రభావితం చేస్తుంది. ద్రాక్షతో తయారు చేసిన ఆహారపదార్థాలకు రంగును తెప్పించేందుకు కృత్రిమ రంగులను ఉపయోగిస్తుంటారు. కాగా గ్రేప్ ఐస్‌క్రీం తినడం వల్ల కుక్కలు చనిపోతాయని ఫుడ్ డ్రగ్ కంట్రోలర్ దాని తయారీని నిషేధించారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నదని ఒక రిపోర్టు తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లేవు. ద్రాక్షలో యాసిడ్ ఉంటుంది. దీనిని పాల ఉత్పత్తులతో కలిపినప్పుడు, రసాయన ప్రతిచర్య జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ద్రాక్షను పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులతో కలపాలనుకుంటే, ద్రాక్ష నుంచి ముందుగా యాసిడ్ వేరుచేయాల్సి వస్తుంది. ద్రాక్షలో ఉండే అధిక నీటి శాతం ఐస్‌క్రీం తయారీకి అనువుగా ఉండదు. ఫైనల్‌గా చూస్తే.. గ్రేప్‌ఐస్ క్రీం తయారు చేయడం అసాధ్యమేమీ కాదని, అయితే పర్ఫెక్ట్ ఐస్‌క్రీం తయారు చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. అందుకే గ్రేప్ ఐస్క్రీంను మనం రుచి చూడలేకపోతున్నాం.



Updated Date - 2022-01-19T17:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising