ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరీ Radhika Merchant.. Mukesh Ambani కి కోడలు కాబోతున్న ఈమె ఎవరంటే..

ABN, First Publish Date - 2022-06-06T21:59:25+05:30

ముకేశ్ అంబానీ.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. 99.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇదే సమయంలో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. కాగా.. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ముకేశ్ అంబానీ.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. 99.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇదే సమయంలో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. కాగా.. ఈ సంపన్నుడి కుటుంబ సభ్యుల జాబితాలోకి అతికొద్ది రోజుల్లోనే మరొకరు చేరబోతున్నారు. రాధికా మర్చంట్ అనే యువతి.. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani)ని పెళ్లి చేసుకుని.. త్వరలోనే అంబానీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే అంబానీ దంపతులు ఏరి కోరి కోడలిగా చేసుకుంటున్న ఆ రాధికా మర్చంట్ ఎవరూ ఏంటి అనే విశేషాలు మీకోసం.


ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్‌కోర్ హెల్త్‌కేర్(Encore Healthcare) సీఈఓ విరెన్ మర్చంట్(Viren Merchant), శైలా మర్చంట్‌ దంపతుల కూతురే రాధికా మర్చంట్. పాఠశాల విద్యను ముంబైలోనే పూర్తి చేసిన రాధికా మర్చంట్.. న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 


అంబానీ కుటుంబంతో విరెన్ మర్చంట్ కుటుంబానికి ముందు నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2018లో జరిగిన ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహ వేడుకల్లో రాధికా మర్చంట్ పాల్గొని సందడి చేశారు. 


రాధికా మర్చంట్‌కు ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆమె..గురు భావనా ​​థాకర్ ఆధ్వర్యంలో శ్రీ నిభా ఆర్ట్స్‌లో భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించారు. తాజాగా కాబోయే అత్తమామల సమక్షంలో ఆమె.. భరతనాట్యంలో అరంగేట్రం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. 


రాధికా మర్చంట్.. అనంత్ అంబానీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వారిద్దరికీ ముందే పెళ్లైందట. 2019లోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారని కొన్ని మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అటు అంబానీ కుటుంబం కానీ.. ఇటు మర్చంట్ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి కామెంట్ చేయలేదు. కాగా.. అనంత్ అంబానీ.. గత ఏడాది రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ మరియు రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్‌గా నియామకం అయ్యారు. 


Updated Date - 2022-06-06T21:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising