ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్యనీతి: వీటిని పాటించేవారికే సమాజంలో గౌరవం!

ABN, First Publish Date - 2022-06-07T12:07:01+05:30

ఆచార్య చాణక్య సమర్థవంతమైన ఆర్థికవేత్త...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య సమర్థవంతమైన ఆర్థికవేత్త, రాజకీయవేత్త దౌత్యవేత్త. ఆయన తన నీతిశాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. వీటిని పాటించడం ద్వారా మనిషి తన జీవితంలో విజయం సాధించవచ్చు. 

వినయం: 

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం వ్యక్తి స్వభావంలో వినయం కనిపించాలి. అలాంటి వ్యక్తి అందరి దగ్గరా గౌరవం పొందుతాడు. జీవితంలో సులభంగా విజయం సాధిస్తాడు.


క్రమశిక్షణ:

చాణక్యనీతిలోని వివరాల ప్రకారం మనిషి నిరంతరం క్రమశిక్షణను పాటించాలి. మీరు చేయాలనుకున్న మీ పనులన్నింటినీ సమయానికి పూర్తి చేయాలి. ఇలా నడుచుకునేవారికి సమాజంలో గౌరవం దక్కుతుంది. 

నిజం:

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనాసరే తన స్వప్రయోజనాల కోసం ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. అలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడు. నిజం మాట్లాడుతూ, నిజాయితీగా ఉండేవారికి సమాజంలో గౌరవం దక్కుతుంది.

సదాలోచన: 

చాలా మందికి ఇతరులకు చెడు చేసే అలవాటు ఉంటుంది. అలాంటివారు ఇతరుల సంతోషాన్ని చూసి ఎంతో అసూయపడతారు. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అందుకే ఎప్పుడూ ఎవరికీ చెడు చేయకూడదు. నిరంతరం సదాలోచన చేసేవారు జీవితంలో ఎదుగుతారు.

Updated Date - 2022-06-07T12:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising