ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Monkeypox virus outbreak:పురుషులు లైంగిక భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోండి

ABN, First Publish Date - 2022-07-28T13:27:22+05:30

ప్రపంచ ఆరోగ్య సంస్థ((WHO) ప్రజలకు తాజాగా సంచలన సలహా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన సలహా

జెనీవా:ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి(Monkeypox virus outbreak) నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ((WHO) ప్రజలకు తాజాగా సంచలన సలహా ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల్లో 18,000 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఐరోపా దేశాల్లో అధికంగా మంకీపాక్స్ కేసులు వెలుగుచూడటంతో ఆయా దేశాలకు చెందిన పురుషులు  ప్రమాదంలో పడ్డారు. ‘‘పురుషులు వారి లైంగిక భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలి’’ అని డబ్ల్యూహెచ్‌వో(World Health Organization) సూచించింది.ఇప్పటివరకు ఆఫ్రికాలోని దేశాల్లో 98శాతం మంకీపాక్స్ కేసులు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషుల్లో(males) నమోదయ్యాయి. 


దీంతో పురుషులు(mens) కొత్త లైంగిక భాగస్వాముల సంఖ్యను తగ్గించడం, కొత్త భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్(Dr Tedros Adhanom Ghebreyesus) సలహా ఇచ్చారు.70శాతం కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు యూరోపియన్ ప్రాంతాల నుంచి, 25శాతం అమెరికా ప్రాంతం నుంచి వచ్చాయని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.


సురక్షితంగా శృంగారం చేయడం, పురుషులతో సెక్స్ చేసే పురుషులు లైంగిక భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవడం, సెక్స్‌ను పునఃపరిశీలించడం, కొత్త భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంకీపాక్స్ వైరస్ ను అరికట్టవచ్చని డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు.


Updated Date - 2022-07-28T13:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising