ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా... మధ్యలో ఊహించని దృశ్యంతో కళ్లు జిగేల్.. చివరకు..

ABN, First Publish Date - 2022-08-20T01:25:52+05:30

గుప్త నిధుల (hidden treasures) కోసం కొందరు అక్రమంగా తవ్వకాలు చేస్తుంటారు. కొందరైతే పురాతన ఆలయాలను.. నిధుల పేరుతో కూల్చేయడం చూస్తూనే ఉన్నాం. పురతాన కాలంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుప్త నిధుల (hidden treasures) కోసం కొందరు అక్రమంగా తవ్వకాలు చేస్తుంటారు. కొందరైతే పురాతన ఆలయాలను.. నిధుల పేరుతో కూల్చేయడం చూస్తూనే ఉన్నాం. పురతాన కాలంలో విలువైన ఆభరాణాలు, నగలు తదితరాలను దొంగల బారి నుంచి రక్షించుకునేందుకు భూమిలో పాతిపెడుతుంటారు. తవ్వకాలు జరిగే సమయంలో కొన్నిసార్లు నిధులు బయటపడ్డాయనే వార్తలు వింటూ ఉంటాం. కంబోడియా ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి మరుగుదొడ్డి కోసం గుంతను తవ్వుతున్నారు. మధ్యలో ఒక్కసారిగా వారి కళ్లు జిగేల్‌మని మెరిశాయి. చివరకు ఏం జరిగిందంటే..


కాంబోడియా ప్రావిన్స్‌ (Province of Cambodia) వాయువ్య ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతంలో సబోయున్ రాన్ అనే 42 ఏళ్ల వ్యక్తి.. మరుగుదొడ్డి కోసం కొడుకుతో కలిసి గుంత తవ్వుతున్నాడు. రెండు మీటర్లు తవ్వగానే వారికి నీలి రంగులో రాయి కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. మరింత తవ్వగా మొత్తం నాలుగు విగ్రహాలు (idols) బయటపడ్డాయి. అవి పురాతన కాంస్య విగ్రహాలుగా గుర్తించారు. ఈ వార్త అందరికీ తెలిసిపోవడంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన పురావస్తు శాస్త్రవేత్తలు.. ఆ విగ్రహాలు 10వ లేదా 11వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. వాటిని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Viral Video: ఓ వైపు వర్షం.. మరో వైపు వరద.. మధ్యలో నడి రోడ్డుపై ఈ పెద్దాయన ఏం చేస్తున్నాడో చూడండి..



Updated Date - 2022-08-20T01:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising