ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్‌లో పెద్ద నోటు విలువ ఎంత?.. భారత్‌తో పోలిస్తే ఎంత తేడా ఉంటుందంటే...

ABN, First Publish Date - 2022-06-01T13:39:54+05:30

పాకిస్తాన్ ప్రస్తుతం రాజకీయ సంక్షోభంతో పాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్తాన్ ప్రస్తుతం రాజకీయ సంక్షోభంతో పాటు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య చాలా విషయాలలో వ్యత్యాసం కనిపిస్తుంది. పాకిస్తాన్ కరెన్సీకి, భారత్‌కు ఎంత తేడా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 ట్రెండ్‌లో ఉన్నాయి. పాకిస్తాన్‌లో దీనికి కాస్త భిన్నమైన వ్యవస్థ ఉంది. భారతదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం 1000 రూపాయల నోటును నిలిపివేశారు. 2000 రూపాయల నోటు తీసుకువచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500, రూ.1000, రూ.5000 నోట్లు ఉన్నాయి. అంటే అక్కడ 5000 రూపాయల నోటు అతిపెద్దది. 


మన నోట్‌పై గాంధీ బొమ్మ ఉన్నట్లే, పాకిస్థాన్‌ నోట్‌లో మహమ్మద్ అలీ జిన్నా ఫొటో ఉంటుంది. భారత్‌ నోట్ల మాదిరిగానే పాకిస్థాన్‌ నోట్లలోనూ భద్రతాపరమైన జాగ్రత్తలు కనిపిస్తాయి. పాకిస్థాన్‌ కంటే భారత్‌ రూపాయి చాలా బలంగా ఉంది. భారతదేశంలోని ఒక రూపాయి.. పాకిస్తాన్‌లో 2.58 రూపాయలకు సమానం. అంటే పాకిస్థాన్ కరెన్సీ విలువ మన కరెన్సీలో సగం. డాలర్‌తో పోల్చితే ఒక అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ రూ.168.82. మన దేశంలోని రెండు వేల రూపాయల నోటు అక్కడ 5154.33 రూపాయలతో సమానం. పాకిస్థాన్ నోట్‌లో వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్ మొదలైన అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 

Updated Date - 2022-06-01T13:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising