ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారి ప్రాణాలు కాపాడిన సీఎం Eknath Shinde

ABN, First Publish Date - 2022-07-01T13:15:16+05:30

ఏకనాథ్ షిండే 1989 నాటి ముంబై అల్లర్ల సమయంలో ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Mumbai riots సమయంలో 

ముంబయి(మహారాష్ట్ర):మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా గురువారం రాత్రి ప్రమాణస్వీకారం చేసిన ఏకనాథ్ షిండే 1989 నాటి ముంబై అల్లర్ల సమయంలో ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు.ఆటోడ్రైవరుగా నిరాడంబర నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన షిండే గత 35 సంవత్సరాలుగా థానే నగరంలోని చాల్ ప్రాంతంలో నివశించారు.తాను మహారాష్ట్ర సీఎంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని షిండే వాగ్దానం చేశారు. దీంతోపాటు తాను ఇరుగుపొరుగు వారికి ఎల్లప్పుడూ రక్షకుడిగా ఉంటానని కొత్త సీఎం షిండే పేర్కొన్నారు. షిండే ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా 1989లో బొంబాయి అల్లర్ల సమయంలో ఏకనాథ్ షిండే ఒక మహిళకు, అతని బిడ్డకు సహాయం చేసిన సంఘటనను సీఎం ఇంటి పొరుగువారు గుర్తు చేసుకున్నారు.


 చాల్ ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు రవాణా సౌకర్యాలు అందుబాటులో లేనందున, షిండే తల్లీబిడ్డను తీసుకెళ్లడానికి ఆటో రిక్షా నడిపారని స్థానికులు చెప్పారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని కాపాడేందుకు షిండే చాల్ నుంచి ఆసుపత్రికి రాత్రిపూట ఆటో రిక్షాలో స్వయంగా తీసుకువెళ్లాడని పొరుగువారు తెలిపారు.షిండే యొక్క విధేయత, అంకితభావాన్నిచాల్ వాసులు ప్రశంసించారు. ‘‘షిండే చాలా తక్కువ నిద్రపోతాడు... అతను ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అతను చూపించే అంకితభావం, విధేయత ప్రశంసనీయం’’ అని సీఎం పొరుగింటి వ్యక్తి వ్యాఖ్యానించారు.షిండే కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో చాల్ ప్రాంతవాసులు సంబరాలు జరుపుకున్నారు. 


Updated Date - 2022-07-01T13:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising