WhatsApp: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. ఒక్క గంటకు సంస్థకు ఎంత నష్టం వస్తుందంటే..
ABN, First Publish Date - 2022-10-26T15:57:05+05:30
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క గంట సంస్థ సేవలు ఆగిపోతే జరిగే నష్టం మామూలుగా ఉండదు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు వినియోగిస్తున్న ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మంగళవారం రెండు గంటల పాటు నిలిచిపోయింది. భారతదేశంలోనే కాదు.. యూకే, సింగపూర్, ఇటలీ, టర్కీ, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కూడా వాట్సాప్ ఆగిపోయింది. భారత్‌లో దాదాపు రెండు గంటల తర్వాత వాట్సాప్ తిరిగి ప్రారంభమైంది. సాంకేతిక లోపం కారణంగా స్వల్ప అంతరాయం ఏర్పడిందని వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయినా మెటా ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క గంట సంస్థ సేవలు ఆగిపోతే జరిగే నష్టం మామూలుగా ఉండదు. వాట్సాప్ సేవలు నిలిచిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది అక్టోబర్‌లో కూడా మెటా సంస్థలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ దాదాపు ఐదుగంటల పాటు ఆగిపోయాయి. వాట్సాప్ ఒక్క గంట ఆగిపోతే మెటా సంస్థకు $222,000 (రూ.1.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందట. గతేడాది మెటా సంస్థల సేవలన్నీ ఐదు గంటలు నిలిచిపోవడంతో జుకర్‌బర్గ్‌కు దాదాపు 600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట. అంతేకాదు.. స్థాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్ విలువ 5 శాతం పతనమైంది. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం వల్లే సర్వర్ క్రాష్ అయిందని సంస్థ పేర్కొంది.
Updated Date - 2022-10-26T16:01:55+05:30 IST