ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా వెళ్లి భార్యను ఆలింగనం చేసుకున్న భర్త.. ఆ వెంటనే తన ఛాతి మీద చేయి పెట్టుకున్నాడు.. తర్వాత ఊహించని విధంగా..

ABN, First Publish Date - 2022-02-26T22:25:55+05:30

ఒకానొక సందర్భంలో చావా, రేవా అనే విషయం ఒకే ఒక్క క్షణంలోనే తేలిపోతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని అతలాకుతలం చేస్తే.. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు రానున్న ఆపదలను తప్పించవచ్చు. ఈ విషయం..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకానొక సందర్భంలో చావా, రేవా అనే విషయం ఒకే ఒక్క క్షణంలోనే తేలిపోతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని అతలాకుతలం చేస్తే.. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు రానున్న ఆపదలను తప్పించవచ్చు. ఈ విషయం తెలీక చాలా మంది క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతుంటారు. చివరకు తమ జీవితం జైలుపాలు చేసుకోవడమే కాకుండా.. అవతలి వ్యక్తుల కుటుంబాలకు శోకాన్ని మిగిల్చుతుంటారు. గుజరాత్‌‌లో తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లిన భర్త.. వేగంగా వెళ్లి భార్యను ఆలింగనం చేసుకున్నాడు. ఆ వెంటనే షర్ట్ లోపల ఉన్న వైర్లను టచ్ చేశాడు. తర్వాత ఒక్కసారిగా ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


గుజరాత్‌లోని​అహ్మదాబాద్ పరిధిలో గల ఆరవల్లి జిల్లా ములోజ్ గ్రామంలో లాలా పాగీ (47), శారదాబెన్‌‌ (43)  దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల లాలాపాగీ రోజూ మద్యం తాగొచ్చి.. భార్యతో గొడవపడేవాడు. ఒక్కోసారి కొట్టడంతో పాటూ చిత్రహింసలకు గురి చేసేవాడు. కొన్ని రోజులు ఓపిగ్గా భరించింది. అయినా భర్తలో ఎలాంటి మార్పూ రాలేదు సరికదా.. ఇంకా ఎక్కువగా వేధించడం మొదలెట్టాడు. దీంతో విసిగిపోయిన శారదా.. నెలన్నర క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి.. అహ్మదాబాద్‌కు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘరాజ్ పట్టణ పరిధి బీటీ ఛప్రా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటికి రావాలని పిలిచినా ఆమె రాకపోవడంతో లాలా పాగీ కోపం పెంచుకున్నాడు.

హిజ్రాకు లింగమార్పిడి చేసేందుకు బీఫార్మసీ విద్యార్థుల ఒప్పందం.. గది అద్దెకు తీసుకుని మరీ ఆపరేషన్.. చివరకు..


ఈ క్రమంలో భార్యను తీసుకొచ్చేందుకు గురువారం రాత్రి అత్త వారింటికి వెళ్లాడు. ఒకవేళ తనతో పాటూ రాకపోతే చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కడుపు చుట్టూ పేలుడు పదార్థాలను కట్టుకుని వెళ్లాడు. మాట్లాడాలని భర్త పిలవడంతో శారదాబెన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంటికి రావాలని మరోమారు పిలిచినా ఆమె స్పందించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో వేగంగా భార్య దగ్గరికి వెళ్లి బలవంతంగా హగ్ చేసుకున్నాడు. ఆ వెంటనే ఛాతిపై చేయి పెట్టి వైర్లను టచ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తునాతునకలై దూరంగా ఎగిరిపడ్డారు. శబ్ధం గట్టిగా వినపడడంతో చుట్టుపక్కల వారు అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలను చూసి అంతా షాక్ అయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. లాలా పాగీ వాడిన పేలుడు పదార్థాలు.. స్థానికంగా ఉండే గిరిజనులు చేపలు పట్టేందుకు వినియోగిస్తారని పోలీసులు తెలిపారు.

కూతురికి త్వరగా పెళ్లి జరిగేలా పూజలు చేయమంటే.. తల్లీ, కూతుళ్లకు నీళ్లిచ్చిన నకిలీ బాబా.. మరుక్షణమే..

Updated Date - 2022-02-26T22:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising