ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయిన నాలుగు నెలలకే భార్యకు పెద్ద పెద్ద కోరికలు.. వాటిని తీర్చలేక ఆ భర్త తీసుకున్న నిర్ణయం..

ABN, First Publish Date - 2022-01-26T21:51:09+05:30

బెంగళూరులో పెళ్లయి నాలుగు నెలలు కూడా గడవకముందే ఆ కాపురంలో కలతలు రేగాయి. భార్య వింత వింత కోరికలన్నింటినీ తీర్చలేక.. భర్త తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

చాంద్ పాషా (ఫైల్)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా పెళ్లయిన జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. భార్య అడిగిందే తడవుగా అన్నీ సమకూరుస్తుంటారు. కొందరు భర్తను అర్థం చేసుకుని ఏవి అడగాలో, ఏవి అడగకూడదో తెలుసుకుని మసలుకుంటూ ఉంటారు. కొందరు మహిళలైతే ఆర్థిక పరిస్థితుల గురించి అసలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన కోరికలన్నీ కోరుతుంటారు. భార్య కోరికలను కాదనలేక ఎంత కష్టమైనా తీరుస్తుంటారు కొందరు. బెంగళూరులో పెళ్లయి నాలుగు నెలలు కూడా గడవకముందే ఆ కాపురంలో కలతలు రేగాయి. భార్య వింత వింత కోరికలన్నింటినీ తీర్చలేక.. భర్త తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..


బెంగళూరులోని బసవేశ్వరనగర్ పరిధి మంజునాథన్ నగర్ ప్రాంతానికి చెందిన చాంద్ పాషా.. మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. నాలుగు నెలల క్రితం ఇతడికి ఉస్మా అనే యువతితో వివాహమైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో ఈసారైనా కలతలు లేకుండా జీవనం సాగించాలని కోరుకునేవారు. పెళ్లయిన కొత్తలో భార్యను వివిధ ప్రదేశాలకు తీసుకెళ్తూ సంతోష పెట్టేవాడు. ఈ క్రమంలో తనకు చిన్న చిన్న బహుమతులు కొనిస్తూ ఉండేవాడు. కొన్నాళ్లు బాగున్న భార్య.. తర్వాత పెద్ద పెద్ద కోరికలు కోరేది. మెకానిక్ పని చేసే చాంద్ పాషా ఆదాయం అంతంతమాత్రమే కావడంతో మొదట కొంత ఇబ్బంది పడేవాడు.

అస్వస్థత కారణంగానే కొడుకు చనిపోయాడనుకున్నారు.. ఓ రోజు కోడలు ఫోన్‌లో మాట్లాడుతుండగా అనుమానం రావడంతో..


భర్త ఆర్థిక పరిస్థితి గురించి అసలు పట్టించుకోని ఉస్మా.. రోజుకో కోరిక కోరేది. అయితే ఎంత ఇబ్బందిగా ఉన్నా కొన్నాళ్లు ఆమె అడిగినవన్నీ కొనిచ్చేవాడు. రానురాను పెద్ద పెద్ద కోరికలు కోరడంతో తన ఆర్థిక పరిస్థితి గురించి వివరించాడు. అయినా ఉస్మా మాత్రం వినిపించుకునేది కాదు. పైగా ‘‘ భార్యను బాగా చూసుకోలేని వాడివి.. నువ్వేం మగాడివి’’.. అంటూ వేధించేది. రోజురోజుకూ వేధింపులు పడలేక.. మరోవైపు బయట ఎవరికీ చెప్పుకోలేక సతమతమయ్యేవాడు. సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి అంతా పడుకున్నాక చాంద్ పాషా.. వేరే గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడితో కలిసి పారిపోయేందుకు భార్య ప్లాన్.. తీరా వెళ్లే క్రమంలో ఎంటరైన భర్త.. చివరకు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..

Updated Date - 2022-01-26T21:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising