ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ట్రాక్‌ల పక్కన ఉండే బోర్డులపై W/L అని ఎందుకు ఉంటుందో తెలుసా? ఇది ఎలా ఉపయోగపడుతుందంటే..

ABN, First Publish Date - 2022-02-24T16:32:57+05:30

మీరు ఏదో ఒక సమయంలో రైల్వే ట్రాక్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు ఏదో ఒక సమయంలో రైల్వే ట్రాక్ క్రాసింగ్ దాటినప్పుడు  ట్రాక్‌ల పక్కన ఉండే బోర్డులను గమనించేవుంటారు. దానిపై W/L అని రాసి ఉంటుంది. దీని అర్థం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ బోర్డు ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసినది. W/L అంటే విజిల్ / లెవెల్ బోర్డ్. ఇది ట్రాక్‌లకు రెండు వైపులా ఏర్పాటు చేస్తారు. అది జీవితాలను ఎలా కాపాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడానికి ఈ బోర్డు ఉపకరిస్తుంది. అన్‌మ్యాన్ లేదా మ్యాన్ క్రాసింగ్ ఉన్నచోట్ల దీనిని ఏర్పాటు చేస్తారు. 


ఈ బోర్డు గుండా రైలు వెళుతున్నప్పుడు లోకో పైలట్‌కు హారన్ ఇవ్వడం తప్పనిసరి. ఈ బోర్డ్‌ పసుపు రంగులో ఉంటుంది. దానిపై W/L అనేది నలుపు రంగుతో ఉంటుంది. ఇలా ఉండటం వలన ఇది దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని గమనించిన రైలు డ్రైవర్ క్రాసింగ్ గేటు దగ్గర నిలబడిన వారిని గమనించి హారన్ కొడుతూ హెచ్చరిస్తాడు. ఈ విధంగా డ్రైవర్.. జనాల్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తం చేస్తాడు. రైల్వే మాన్యువల్‌లో దీనిని ఏర్పాటు చేయడానికి నియమాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ బోర్డు నేల నుండి సుమారు 2.100 మిమీ ఎత్తులో ఏర్పాటు చేయాలి. అలాగే రెండు బోర్డులు ఏర్పాటు చేయాలి. మొదటిది ఆంగ్లంలో, రెండవది హిందీలో ఉండాలి. అవి ఒకదానిపై ఒకటి అమర్చి ఉంటాయి. హిందీలో C/F అని ఉంటుంది. ఇందులో సి అంటే విజిల్, ఎఫ్ అంటే గేట్ అని రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ తెలిపింది.

Updated Date - 2022-02-24T16:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising