ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టును చుట్టుకున్న ఇంద్రధనస్సు.. ఆకర్షిస్తున్న వింత వృక్షాలు!

ABN, First Publish Date - 2022-03-19T16:22:50+05:30

ఇటీవల ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా రెయిన్‌బో యూకలిప్టస్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చెట్టు ఇంద్రధనస్సు రంగులతో వెలిగిపోతోంది. ఇది ప్రపంచంలోని రంగురంగుల చెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది ఒక ప్రత్యేకమైన చెట్టు. దీనిని సైన్స్ భాషలో యూకలిప్టస్ డెగ్లుప్టా అంటారు. దీనిని రెయిన్‌బో గమ్ అని కూడా అంటారు. ఈ చెట్టులో ఇన్ని రంగులు ఎందుకు కనిపిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రత్యేక రంగుల చెట్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియాలో కనిపిస్తాయి. వర్షారణ్యాలలో కనిపించే యూకలిప్టస్ జాతి ఇది ఒక్కటే. 


వన్ ఎర్త్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చెట్టు వయస్సు పెరిగేకొద్దీ, దాని రంగు మారుతుంది. దాని రంగురంగుల రూపానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ చెట్టు పెరిగి పెద్దదవుతున్న కొద్దీ దాని బెరడు తొలగిపోతుంది. అప్పడు అక్కడ  ప్రకాశవంతమైన రంగులు కనిపించడం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ప్రకృతి కళ అని సోషల్ మీడియా యూజర్స్ అంటున్నారు. రెయిన్‌బో యూకలిప్టస్ సగటు పొడవు 76 మీటర్లు. ఈ చెట్లు హవాయి, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాలో కూడా కనిపిస్తాయి. అయితే అక్కడ వాటి పొడవు 30 నుండి 38 మీటర్ల వరకు ఉంటుంది. ఈ చెట్టు వాణిజ్య స్థాయిలో చాలా విలువైనదిగా పరిగణిస్తారు. కాగితం తయారీలో ఈ చెట్టు బెరడును వినియోగిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది రంగురంగులగా కనిపించినప్పటికీ దానితో తయారైన కాగితంపై ఈ ప్రభావం ఉండదు. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. సాధారణ చెట్ల మాదిరిగా ఇవి చీడపీడల బారిన పడవు.

Updated Date - 2022-03-19T16:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising