ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యన్ సైన్యంపై గెరిల్లా దాడికి దిగిన ఉక్రెయిన్...ఈ పోరాటం ఎలా జరుగుతుందంటే..

ABN, First Publish Date - 2022-03-07T18:08:23+05:30

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం 12 రోజులకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం 12 రోజులకు చేరింది. రష్యా.. ఉక్రెయిన్‌పై నిరంతరం దాడి చేస్తోంది. అదే సమయంలో ఉక్రెయిన్ కూడా రష్యాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. రష్యా సైన్యంపై ఉక్రెయిన్.. గెరిల్లా స్టైల్‌లో దాడి చేస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గెరిల్లా యుద్ధంలో, ఉక్రెయిన్.. రష్యా సైన్యం కాన్వాయ్‌పై అనేకసార్లు కాల్పులు జరిపి ఆర్మీ కాన్వాయ్‌ను దగ్ధం చేసింది. ఉక్రెయిన్ సైనికులు ఈ గెరిల్లా యుద్ధాన్ని వీడియోలో బంధించారు. ఈ వార్తల నేపధ్యంలో గెరిల్లా యుద్ధం ఏమిటి? అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  గెరిల్లా దాడి లేదా గెరిల్లా యుద్ధాన్ని గెరిల్లా వార్‌ఫేర్ సిస్టమ్ అని కూడా అంటారు.  


గెరిల్లా అనేది స్పానిష్ పదం గెరా (యుద్ధం) నుండి వచ్చిందని చెబుతారు. 19వ శతాబ్దంలో స్పెయిన్, పోర్చుగీస్ నెపోలియన్‌కి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని చేస్తున్నప్పుడు ఈ పదం ఉపయోగం పెరిగింది. ఇది ఒక రకమైన రహస్య యుద్ధం. దీనిలో ఒక సైన్యం మరొక సైన్యంపై రహస్యంగా దాడి చేసి.. అక్కడి నుండి పారిపోతుంది. ఈ రకమైన యుద్ధంలో సైనికులు లేదా యోధులు సాధారణ ప్రజల మధ్యలోనూ ఉంటూ అవకాశం వచ్చిన వెంటనే శత్రు సైన్యంపై దాడి చేస్తారు. వీరు గెరిల్లా దాడుల ద్వారా సైన్యాన్ని, పోలీసులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే గెరిల్లా యుద్ధంలోని యోధులు.. శత్రువు సమీపించిన వెంటనే, అకస్మాత్తుగా బయటకు వచ్చి వేగంగా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వేగంగా దాడి చేయడం దీనిలోని ప్రత్యేకత. ఈ యుద్ధ రీతిలో తక్కువ మంది సైనికులు.. శత్రువుకు ఎక్కువ నష్టం కలిగించగలరు. అలాగే శత్రువు ప్రణాళికను అడ్డుకుంటారు. ఇందులో ప్రాణనష్టం రేటు చాలా తక్కువ. తక్కువ వనరులు కలిగిన ఉక్రెయిన్  ఈ తరహా యుద్ధాన్ని ఆశ్రయించడం ద్వారా రష్యా సైన్యాన్ని దెబ్బతీస్తోంది.

Updated Date - 2022-03-07T18:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising