ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో దడపుట్టించిన ‘డెరేకో’... రంగులు మారిన ఆకాశం.. విస్తుపోతున్న జనం!

ABN, First Publish Date - 2022-07-09T17:41:38+05:30

అమెరికాలోని నెబ్రాస్కా, మిన్నెసోటా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని నెబ్రాస్కా, మిన్నెసోటా, ఇల్లినాయిస్‌లలో ‘డెరేకో’ తుఫాను కారణంగా ఆకాశం నీలి రంగు నుండి ఆకుపచ్చ రంగులోకి మారింది. ఈ తుఫాను పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పలు చెట్లు నేలకూలాయి. విద్యుత్ లైన్లు నేలమట్టమయ్యాయి. ఇంతకు ముందు కూడా చాలా తుఫానులు వచ్చాయని, అయితే ఆకాశం రంగు ఆకుపచ్చగా మారడం ఎప్పుడూ చూడలేదని అమెరికావాసులు అంటున్నారు. 


దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘డెరేకో అనేది స్పానిష్ పదం 'లా డెరేకో' నుండి ఉద్భవించింది. సూటిగా అని దీని అర్థం. ఇటువంటి తుఫానులు మే నుండి ప్రారంభమై జూన్-జూలై వరకు వస్తాయి. టోర్నడోల వంటి తుఫానుల కంటే ఇవి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, సైన్స్ ప్రకారం తుఫానుల కారణంగా, ఆకాశం రంగు మారుతుంది. కాంతి కిరణాలలో పెద్ద మొత్తంలో నీరు ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం పెద్ద వర్షపు చినుకులు, వడగళ్ళు.. నీలి తరంగదైర్ఘ్యం మినహా అన్ని రంగులను చెల్లాచెదురు చేస్తాయి. ఫలితంగా ఆకాశం రంగు ఆకుపచ్చగా మారింది.

Updated Date - 2022-07-09T17:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising