ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బులు నష్టపోయానని కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన మహిళ.. చివరగా అకౌంట్ బ్యాలెన్స్ పరిశీలిస్తే..

ABN, First Publish Date - 2022-01-17T01:26:42+05:30

సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చాక.. మంచి ఎంత జరుగుతుందో, చెడు కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. ఆన్‌లైన్‌లో వివిధ సైట్ల ద్వారా ఇటీవల చాలా మంది నష్టపోతున్నారు. ఇందులో నిరక్ష్యరాస్యులతో పాటూ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చాక.. మంచి ఎంత జరుగుతుందో, చెడు కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. ఆన్‌లైన్‌లో వివిధ సైట్ల ద్వారా ఇటీవల చాలా మంది నష్టపోతున్నారు. ఇందులో నిరక్ష్యరాస్యులతో పాటూ ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా.. ఏదో ఒక సందర్భంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. డబ్బులు నష్టపోయానని, తిరిగి పంపించాలని ఇటీవల ముంబైలో ఓ మహిళ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసింది. చివరగా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుని ఖంగుతింది. వివరాల్లోకి వెళితే..


ముంబై అంధేరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఈ అనుభవం ఎదురైంది. గత ఏడాది జూలైలో ఆమె ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేసింది. డబ్బులు పంపించే క్రమంలో రూ.9,999 నష్టపోయింది. అలాగే అక్టోబర్‌లో ఆన్‌లైన్‌లో డ్రై ఫ్రూట్స్ కోసం ఆర్డర్ చేస్తుండగా.. రూ.1,496 నష్టపోయింది. పోయిన డబ్బులను ఎలా పొందాలో ఆమెకు అర్థం కాలేదు. ఈ క్రమంలో ఆమె కస్టమర్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసింది. అక్కడ వారు సూచించిన నంబర్‌కు ఫోన్ చేసింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ డబ్బులు పంపిస్తామని, అందుకోసం ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించాడు.

బీకాం విద్యార్థినిని ఆమె తల్లితో సహా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం చేసేవాళ్లంటే..


అవతలి వ్యక్తి పంపించిన యాప్‌ను మహిళ తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంది. దీంతో ఆమె బ్యాంకు వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు చేరిపోయాయి. గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్యలో మహిళ ఖాతా నుంచి సుమారు రూ.11.78 లక్షలు మాయమయ్యాయి. చివరగా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న మహిళ ఖంగుతింది. లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

15 రోజుల క్రితం పెళ్లి.. గంటల తరబడి చాటుగా భార్య ఫోన్ కాల్స్.. నిఘా వేసి భర్త ఇచ్చిన ట్విస్ట్‌తో ఆమెకు మైండ్‌బ్లాంక్..!

Updated Date - 2022-01-17T01:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising