ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

young man cheated the girl: అమ్మాయి పేరుతో యువతికి దగ్గరైన యువకుడు.. ఓ రోజు నేరుగా ఆమె వద్దకు వెళ్లి దుస్తులు చించుకుని.. చివరకు..

ABN, First Publish Date - 2022-08-04T00:53:29+05:30

యువతులతో (young women) పరిచయం పెంచుకోవడానికి కొందరు యువకులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి మరీ క్రూరంగా ప్రవర్తిస్తుంటారు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువతులతో (young women) పరిచయం పెంచుకోవడానికి కొందరు యువకులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి మరీ క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. వారు అనుకున్నది సాధించుకునేందుకు ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. యువతితో పరిచయం పెంచుకోవడానికి ఓ యువకుడు అమ్మాయి పేరు పెట్టుకున్నాడు. ఇలా ఆమెకు దగ్గరై.. ఓరోజు ఏకంగా యువతి ఇంటికి వెళ్లాడు. అక్కడ దుస్తులు చించుకుని మరీ అతడు చేసిన నిర్వాకం.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం లక్నో పరిధి గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి గోరఖ్‌పూర్‌లో గది అద్దెకు తీసుకుని, పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆమెను.. గోరఖ్‌పూర్ కంపేర్‌గంజ్‌లో నివాసం ఉండే ఆరిఫ్ అనే యువకుడు రోజూ గమనించేవాడు. ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నించేవాడు. చివరకు ఆ యువతికి ఆన్‌లైన్‌లో అమ్మాయి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. తర్వాత రోజూ ఆమెతో చాటింగ్ (Online chatting) చేసేవాడు. కొన్నాళ్లకు యువతికి మరింత దగ్గరయ్యాడు. ఏడాది గడిచిన తర్వాత నేరుగా ఆమె వద్దకు వెళ్లాడు. రోజూ చాటింగ్ చేసేది తనే అని చెప్పడంతో యువతి షాక్ అయింది. మోసపోయానని తెలుసుకున్న ఆమె.. అక్కడి నుంచి లక్కోకు వచ్చేసింది.

attack on daughter in law: కోడలు, ఆమె సోదరిని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చిన మామ.. అంతా చూస్తుండగా.. కారణం ఏంటని విచారిస్తే..


యువకుడి మతం కూడా వేరు కావడంతో అప్పటి నుంచి అతన్ని దూరం పెట్టేసింది. అయినా యువకుడు మాత్రం ఆమెతో మాట్లాడాలని రోజూ వివిధ రకాలుగా ప్రయత్నిస్తుండేవాడు. ఫొటోలు (Photos), పర్సనల్ చాటింగ్ వివరాలు బయటపెడతానని బెదిరించేవాడు. అయినా యువతి మాత్రం అతడితో మాట్లాడేది కాదు. దీంతో ఇటీవల లక్నోలో ఆమె ఉంటున్న ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా రోడ్డుపై దుస్తులు చించుకుని మరీ బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా యువతితో చేసిన చాటింగ్ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చివరకు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tamil Nadu News: యువతిపై కన్నేసిన కాలేజ్ క్యాంటిన్ వర్కర్.. ఒంటరిగా వెళ్తుండగా కాపుకాసి మరీ.. చివరకు బాధితురాలి స్నేహితురాలి చొరవతో..



Updated Date - 2022-08-04T00:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising