ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊర్లోకి చొరబడ్డ చిరుత పులి.. దాడి చేసి రేకుల షెడ్డుపై మాటు వేయడంతో.. పరుగులు తీసిన గ్రామస్తులు.. చివరకు..

ABN, First Publish Date - 2022-03-06T21:43:05+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలోకి పట్టపగలే ఓ చిరుత చొరబడింది. బాలుడిపై దాడి చేసిన అనంతరం రేకుల షెడ్డుపై మాటు వేసి పొంచి ఉండడంతో గ్రామస్తులంతా భయంతో పరుగులు తీశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటవీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు నిత్యం వివిధ సమస్యలతో సతమతమవుతుంటారు. చీకటి పడిందంటే వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. ఎటువైపు నుంచి ఏ విష సర్పాలు చొరబడతాయో, ఏ క్రూరమృగాలు దాడి చేస్తాయో.. అనే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటారు. గతంలో చాలా గ్రామాలపై ఏనుగులు, సింహాలు, చిరుత పులులు.. దాడి చేసిన ఘటనలు ఏన్నో చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలోకి పట్టపగలే ఓ చిరుత చొరబడింది. బాలుడిపై దాడి చేసిన అనంతరం రేకుల షెడ్డుపై మాటు వేసి పొంచి ఉండడంతో గ్రామస్తులంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...


ఉత్తరప్రదేశ్ కొత్వాలి జిల్లా ఎటాహ్‌ సమీపంలోని నాగ్లాసమాల్‌ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ పరిసరాల్లో మూడు రోజులుగా పులి సంచారం వార్తలు షికారు చేశాయి. పొలాల్లో పులి కాలి గుర్తులు కనిపించడంతో గ్రామస్తులంతా భయం భయంగా కాలం గడుపుతున్నారు. అయితే శనివారం అనూహ్యంగా ఓ పులి పట్టపగలే గ్రామంలోకి చొరబడింది. ఒక్కసారిగా 11ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. బాలుడి కేకలతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. కర్రలు, కత్తులు పట్టుకుని గట్టిగా అరవడంతో బాలుడిని వదిలేసిన పులి.. ఓ రేకుల షెడ్డుపైకి వెళ్లి అక్కడే మాటు వేసింది. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రేకుల షెడ్డుపైనే గంటల తరబడి పొంచి ఉన్న పులిని.. గ్రామస్తులంతా దూరంగా నిలబడి ఆసక్తిగా గమనించారు.

వరుస కాదని తెలిసినా బాలికపై వక్ర దృష్టి.. తల్లి, భార్య సహకారంతో చివరికి అతడు చేసిన పని..


కొందరు యువకులు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. మరికొందరు దాన్ని తరిమికొట్టాలనే ఉద్దేశంతో ఈలలు, అరుపులతో హోరెత్తించారు. అయినా ఆ పులి మాత్రం చాలా సేపు రేకుల షెడ్డుపైనే ఉండిపోయింది. తమ గ్రామంపై పులి దాడి చేసిందంటూ అటవీ అధికారులకు సమాచారం అందించారు. కొన్ని గంటల అనంతరం అడవిలోకి పారిపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ గ్రామంలోకి తరచూ క్రూరమృగాలు చొరబడుతున్నాయని, దీంతో ప్రశాంతంగా నిద్రపోలేకున్నామని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.

కోతిని తినాలని సాహసం చేసిన పులి.. అష్టకష్టాలు పడి చెట్టెక్కింది.. చివరకు..



Updated Date - 2022-03-06T21:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising