ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లిరోజున భార్యపై ప్రేమ చూపించాల్సింది పోయి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడు చెప్పిన మాట.. చివరకు అంతా షాక్..

ABN, First Publish Date - 2022-01-08T21:49:06+05:30

కర్ణాటకలో ఓ భర్త తమ పెళ్లి రోజున అందరికీ షాక్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడు చెప్పిన మాటలు విన్న పోలీసులకు.. చివరకు అసలు నిజం తెలిసింది...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దంపతులకు పెళ్లి రోజు ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పనిలేదు. తమ వివాహ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భార్యపై తమకున్న ప్రేమను వస్తువులు, దుస్తుల రూపంలో చూపిస్తుంటారు. కొందరైతే భార్యకు ఆరోజును గుర్తుండేలా చేస్తూ విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. పిల్లలున్న తల్లిదండ్రులైనా.. తమ పెళ్లిరోజున నూతన వధూవరులుగా మారిపోతుంటారు. అయితే కర్ణాటకలో మాత్రం ఓ భర్త తమ పెళ్లి రోజున అందరికీ షాక్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడు చెప్పిన మాటలు విన్న పోలీసులకు.. చివరకు అసలు నిజం తెలిసింది.


కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకా కోణనూరు గ్రామలో సుమ, నారప్ప దంపతులు నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 25వ తేదీ వీరి పెళ్లి రోజు కావడంతో ప్రతి ఏడాది ఘనంగా జరుపుకొనేవారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తనకు మంచి మంచి వస్తువులు, చీరలు కొనిపెడతాడని ఆ భార్య ఎంతో సంతోషించింది. ఆ రోజు రానే వచ్చింది. అయితే ఈ పెళ్లి రోజు ఆమెకు చివరి రోజు అవుతుందని ఊహించలేకపోయింది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. గిఫ్టులు ఇవ్వాల్సిన భర్త, ఆమెను గుట్టుగా మట్టుబెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా బాత్‌రూంలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు.

వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..


బయటెవరికీ డౌట్ రాకుండా ఏమీ ఎరగనట్టు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని వివిధ రకాలుగా ప్రశ్నించారు. అనంతరం అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో వారికి అనుమానం వచ్చి.. అతన్ని వారి స్టైల్‌లో విచారించారు. దీంతో విషయం మొత్తం చెప్పేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. అతడిపై వరకట్న వేధింపులు, హత్య కేసును నమోదు చేశారు.

గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తల్లి.. ఈ ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!

Updated Date - 2022-01-08T21:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising